Breaking News

12/02/2019

కాంగ్రెస్ లో యూపీ జోష్

లక్నో, ఫిబ్రవరి 12, (way2newstv.in)
త్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు రాయబరేలి, అమేధి మినహా పొత్తులో భాగంగా మరే సీటు కేటాయించడానికి రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అగ్రనేతలు అసహనం చెంది యూపీలో పట్టు పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని ఒక గాడిన పెట్టేంటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో పూర్తిగా పట్టుకోల్పోయిందనే చెప్పాలి. 


కాంగ్రెస్ లో యూపీ జోష్

కాంగ్రెస్ కు ప్రధాన ఓటు బ్యాంకు అయిన ముస్లింలు, బ్రాహ్మణులు, అగ్రవర్ణాల ఓట్లు సయితం ఇతర పార్టీల ఖాతాలోకి మారిపోయాయి. ప్రధానంగా రైతాంగం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరిగింది. ఈ సామాజిక వర్గాలన్నింటినీ ప్రసన్నం చేసుకుని తిరిగి తమ చెంతకు చేరేలా కాంగ్రెస్ అగ్రనేతలు యూపీలో ప్రత్యేక ప్లాన్ ను అమలు చేస్తున్నారు.ఒకవైపు ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ బలంగా ఉంది. ముఖ్మమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సయితం యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు సయితం పార్లమెంటులో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.యూపీ తూర్పు ప్రాంతానికి ఇన్ ఛార్జిగా నియమించిన ప్రియాంక గాంధీ  నాలుగు రోజుల పాటు యూపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రియాంక 15 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొన్నారు.  యూపీలో ప్రధానంగా యువత, మహిళలు టార్గెట్ గా ప్రియాంక గాంధీ పర్యటన సాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంక పర్యటనతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రియాంక పర్యటనలతోనైనా మాయావతి, అఖిలేష్ ల ఆలోచనల్లో మార్పు వస్తుందన్న ఆశతో కాంగ్రెస్ ఉందన్నది విశ్లేషకుల అంచనా. ప్రియాంక పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుంది కాని కోల్పోయిన ఓటు బ్యాంకు దక్కుతుందా? అన్నదే ప్రశ్న.

No comments:

Post a Comment