న్యూఢిల్లీ, జనవరి 30, (way2newstv.in)
ప్రముఖ స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రపై ఇండిగో ఎయిర్‌లైన్స్ నిషేధం విధించడంపై వివాదం ముదురుతోంది. ఇండిగో ప్రైవేట్ ఎయిర్‌లైన్ విమానంలో వెళుతున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిని హేళన చేశారన్న ఆరోపణలపై కునాల్ కామ్ర మీద ఇండిగో రాత్రి నిషేధం విధించింది. వెంటనే ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో కూడా ఆయన్ను అనుమతించబోమని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ రాత్రి ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఇదే దారిలో సాగుతూ స్పైస్‌జెట్ విమానయాన సంస్థ అతన్ని బహిష్కరించింది.
వివాదమౌతున్న కునాల్ కామ్రాపై ఎయిర్ లైన్స్ వివాదం
మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. దీంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారం ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.కునాల్ కామ్రపై నాలుగు ఎయిర్‌లైన్స్ నిషేధం విధించడం ఓ పిరికి పంద చర్య. తమ పరపతి, ప్రాబల్యాన్ని ఉపయోగించి ఓ విమర్శకుడి గొంతు నొక్కేసే చర్య. 24x7 అసత్య వార్తలను ప్రసారం చేసే వారు.. తమను ప్రశ్నిస్తే వెన్నెముక లేని వారిలా ప్రవర్తిస్తారు.’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కుల వివక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధికా వేములను ఉద్దేశించి ఆర్నాబ్ స్వామి తన షోలో తన కులం ఏమిటంటూ ఆమెను అవమానించారు. దీన్ని మనసులో పెట్టుకున్న కునాల్.. విమానంలో ఆర్నాబ్ కనిపించగా ఈ విషయమై నిలదీశారు. దానికి ఆయన స్పందించకుండా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లాప్‌టాప్‌తో బిజీ ఉండేందుకు ప్రయత్నించగా ఆయన జాతీయవాదాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవడంతో కునాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. కునాల్ తన కామిడీ షోలలో అధికార పక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment