రామగుండం జనవరి 22 (way2newstv.in)
మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ బూతును, మంచిర్యాల పట్టణం లోని బాలికల ప్రభుత్వ పాఠశాల లోని పోలింగ్ బూత్ లను రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ పరిశీలించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఉదయం నుండి క్యూ లైన్ లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 853 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతుందని 461 పోలింగు లొకేషన్ లలో 264 డివిజన్ లలో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం రెండు వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇద్దరు డిసిపి, అడిషనల్ డీసీపీ లు, ఏసీపీ లు పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలైన చెన్నూరు బెల్లంపల్లిలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని సీపీ తెలిపారు.
No comments:
Post a Comment