Breaking News

07/01/2020

యడ్డీకి గ్రీన్ సిగ్నల్

బెంగళూర్, జనవరి 7  (way2newstv.in)
మోదీ కర్ణాటక వచ్చిన వేశావిశేషమేమో కాని ఆ రాష్ట్రానికి నిధులు ఏమీ రాకపోయినా బీజేపీ నేతల ముఖాలు మాత్రం కళకళలాడుతున్నాయి. దీనికి కారణం మంత్రి వర్గ విస్తరణ. నిజానికి మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేదన్న వార్తలు వచ్చాయి. సంక్రాంతి తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అప్పటి వరకూ వెయిట్ చేయక తప్పదని ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా తన సన్నిహిత నేతలతో అన్నట్లు సమాచారం. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న వారు డీలా పడ్డారు.ఇప్పటికే ఉప ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చి దాదాపు నెల గడుస్తోంది. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఒకసారి మాత్రమే విస్తరణ జరిగింది. తర్వాత విస్తరణ చేయాలని యడ్యూరపప్ప పట్టుబట్టినా అధిష్టానం అనుమతి ఇవ్వలేదు.
 యడ్డీకి గ్రీన్ సిగ్నల్

ఈలోగా ఉప ఎన్నికలు రావడంతో పూర్తిగా మంత్రి వర్గ విస్తరణ అంశం మూలనపడిపోయింది.అయితే ఉప ఎన్నికల్లో 12 స్థానాలను గెలుచుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వ సుస్థిరమయింది. ఉప ఎన్నికల సందర్భంగా అనర్హత వేటు పడి తిరిగి పోటీ చేసి గెలిచిన వారికి తన మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని యడ్యూరప్ప మాట ఇచ్చారు. వీరిలో పది మంది వరకూ గెలిచారు. వీరందరికీ యడ్యూరప్ప మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. వీరి విషయంలో మాత్రమ యడ్యూరప్ప మంత్రి పదవులు ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు.ప్రస్తుతం యడ్యూరప్ప మంత్రి వర్గంలో కేవలం 16 మందికే చోటు కల్పించే అవకాశం ఉంది. ఇందులో అనర్హత వేటు పడి తిరిగి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ సీనియర్ నేతలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంతాల వారీగా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మోడీతో మంత్రి వర్గ విస్తరణపై యడ్యూరప్ప చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల రెండో వారంలో మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యడ్యూరప్ప విదేశీ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment