జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్
కర్నూలు, జనవరి 28 జనవరి 28, (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయం లో ని వాలంటీర్ల ద్వారా వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నగదు పంపిణీ చేయనున్నారని, పెన్షన్ నగదు పంపిణీకి బ్యాంకు మేనేజర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ బ్యాంకు మేనేజర్ లకు కోరారు. సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూరల్ ఏరియాలో 882 గ్రామ సచివాలయంలో 3,21,193 పెన్షన్ లబ్ధిదారులకు రూపాయలు 78,60,21,269 గ్రామ సచివాలయం ఖాతాలో నగదు జమ చేయాలన్నారు.
పెన్షన్ నగదు పంపిణీ బ్యాంకర్ మేనేజర్లు సహకరించాలి
అలాగే 303 వార్డు సచివాలయం 80,847 వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులు ఉన్నారని 19,98,09,431 రూపాయల నగదు వెంటనే వార్డు సచివాలయం ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని బ్యాంకు అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు బ్యాంక్ అధికారులు, మెప్మా, డి ఆర్ డి ఎ, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వాలెంటర్ల్లు ఫిబ్రవరి ఒకటో తేదీ పంపిణీ చేస్తున్న పెన్షన్ విధానాన్ని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పర్యవేక్షించాలి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయం లో వాలంటీర్ల వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు బ్యాంక్ అధికారులు డబ్బులను ఈ రోజే గ్రామ, వార్డు సచివాలయం ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి శ్రీనివాసులు, ఎం డి ఎం నాగేష్, నాబార్డు ఎజిఎం పార్థవ్, వివిధ బ్యాంకుల మేనేజర్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment