అదిలాబాద్, జనవరి 10, (way2newstv.in)
వసతిగృహాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వసతిగృహ విద్యార్థులకు చలిని తట్టుకునే దుప్పట్టు ఉండాలి. తలుపులు, కిటికీల్లోంచి చలిగాలి రాకుండా చూడాలి. వేడి నీళ్లు అందుబాటులో ఉండాలి. కానీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వాటర్ హీటర్ల ఉపయోగం లేదు. ఉదయం పూట విద్యార్థులు చన్నీటి స్నానాలు చేయాల్సి వస్తోంది. చాలా చోట్ల గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేక చలితో వణికిపోతున్నారు. దోమలతో వేగలేకపోతున్నారు. చలి కాలం నేపథ్యంలో మరమ్మతులకు ఎలాంటి నిధులూ రాలేదని, సంక్షేమాధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని ఆదరించాల్సిన సంక్షేమ వసతిగహాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అధిక శాతం వసతిగహాల్లో విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు లేవు.
సంక్షామ హాస్టళ్లు
చలి కాలం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల విద్యార్థులకు ఉలెన్ బ్లాంక్లెట్లు అందలేదు. బెడ్‌షీట్లు, కార్పెట్లు కొన్ని చోట్ల మాత్రమే అందజేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, అసిఫాబాద్ కొమురంభీం జిల్లాలో చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొని ఉంది.పలు చోట్ల శుద్ధ జల యంత్రాలు నెలకొల్పిన అవి పనుచేయక పోవడం తో విద్యార్థులు బోరు వద్దే నీరు తాగాల్సి వస్తోంది.శీతాకాలం ప్రారంభమైనా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో ఇంటి నుండి తెచ్చుకున్న దుప్పట్లతోనే కొందరు విద్యార్థులు చలి నుండి కాపాడుకుంటున్నారు. మరో వైపు దోమల నివారణకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.వసతి గృహల్లో విద్యార్థులు చల్లని నీటితోనే స్నానాలు చేస్తున్నారు...చాలా చోట్ల మంచాలు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు..కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో 44 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ,6 ఆశ్రమ సాటిలైట్ పాఠశాలలు కలిపి మొత్తం 50 వరకు పాఠశాలలు ఉన్నాయి.జిల్లాలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో సుమారు 12 వేల మంది విద్యను అభ్యసిస్తుండగా ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు 1 నుండి 3వ తరగతి వరకు 46 పాఠశాలలో సుమారు 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు.గిరి పుత్రులకు భోజన సదుపాయం తోపాటు మెరుగైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు అసౌకర్యాలతో స్వాగతమిస్తున్నాయి. దీంతో చాలా చాలీచాలని వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఆశ్రమ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్న ప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ఉండడంతో సౌకర్యాల కల్పన జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి... జిల్లాలోని ప్రతి మండలంలో గిరి పుత్రుల కోసం ఏర్పాటుచేసిన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లాలోని తిర్యాని మండలం లోని సుంగపూర్ శాటిలైట్ సెంటర్ , రొంపల్లి ఆశ్రమ పాఠశాల , మణిక్య పూర్ కస్తూర్బా వసతి గృహాల్లో నేటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు దుప్పట్లు ఉన్ని దుస్తులు పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు రాత్రి సమయంలో గజగజ వణికిపోతున్నారు. శుద్ధ జలం, పండ్లు, పాలు నెలల తరబడి పంపిణీ చేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలలో సుమారు వంద నుంచి 200 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో సగం మంది బాలికలు సగం బాలురు ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వేడినీళ్లు అందించే సౌరశక్తి పరికరాలు అందించినా కూడా ఉపయోగం లేదని విద్యార్థిని, విద్యార్థులు వాపోతున్నారు. మరికొన్ని ఆశ్రమ వసతిగృహాల పాఠశాలలో వేడినీళ్లు అందించే సౌర శక్తి పరికరాలు బిగించ లేదు. దీంతో చన్నీళ్ళతో స్నానాలు చేస్తున్నారు. సుంగపూర్ పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక పోవడం తో కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుద్ధ జలం కోసం లక్షలు ఖర్చు చేసి నిర్మించిన వాటర్ ట్యాంకులు వృధాగా ఉంటున్నాయి. మరో వసతి గృహం లో అధికారులు విద్యార్థులకు పంపించిన బూట్లు చిన్నవిగా ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు .. గిరిపుత్రులు ఉన్నత స్థానానికి ఎదగడానికి వసతిగృహాల్లో ఆశ్రమ పాఠశాలలో ఉండి విద్యనభ్యసిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నని చెపుతునప్పటికి అవి అందని ద్రాక్షలాగే ఉంటుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు ఉన్నాయి కానీ అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని. ఏ ఆశ్రమ పాఠశాలలో చూసినా ఏముంది గర్వకారణం అని సామెత లాగా అన్ని సమస్యలతోనే స్వాగతం పలుకుతాయని.చలికాలం మూడు నెలలూ ప్రతి విద్యార్థికి స్నానా నికి వేడినీళ్లు సరఫరా చేయాలని ఉన్నతా ధికారులు ఆదేశించినా ఆచరణలో మాత్రం కార్య రూపం దాల్చడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అనేక హాస్ట ళ్లలో గదులకు కిటికీలు లేకపోవ డంతో చలి గాలి వీస్తోంది. మంచాలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై పడుకో వాల్సి వస్తోంది....ఇంత చలిలో కూడా పిల్లలు చన్నీళ్ళ స్నానాలు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారని అయినప్పటికీ ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోని వీరి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు..జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మరో కశ్మీరంలా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహబూబ్ ఘాట్‌లను ఆనుకొని ఉన్న నిర్మల్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో చలికాలాన్ని తట్టుకొనేలా విద్యార్థులకు రగ్గులు, దుప్పట్లతో పాటు, ఊలు దుస్తులను అందజేస్తోంది. అయితే జిల్లాలో మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నారుఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్సీ, బీసీ, వసతి గృహాల్లో దుప్పట్లను సంబంధిత వసతి గృహాల్లో ఉన్న తరగతిని బట్టి మొదట తరగతిలో చేరిన విద్యార్థులకు అందజేస్తుంటారు. అలా వాటిని వారు మూడేళ్లు వాడుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment