Breaking News

08/01/2020

కరీంనగర్ లో అప్పుడే నీటి కొరత

కరీంనగర్, జనవరి 8, (way2newstv.in)
జమ్మికుంట పట్టణంలో తాగునీటి సమస్య నిరంతరంగా కోనసాగుతున్నది. వేసవి కాలంలో మాత్రమే కాకుండా 365రోజులు పట్టణంలోని వివిధ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. తరచు వివిధ వార్డులలో ఖాళీ బిందెలతో నగరపంచాయితీ ముందు అందోళనలు చేస్తుండగా, నగరపంచాయతీ కమీషనర్,చైర్మెన్,వారిని తాత్కాలిక ఉపశమనం కలిగించి పంపిస్తున్నరే తప్ప, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కరం చూపడం లేదు. సుమారు 50 వేల జనాభ కలిగిన జమ్మికుంట పట్టణంలో ప్రతి రోజు పరిసర గ్రామాల నుండి లక్షకుపైగా ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తు,పోతు ఉంటారు. వీరి అవసరాలకు అనుగుణంగా నీటిని సరఫరా చేయడంలో పాలక వర్గం పూర్తిగా విఫలం అవుతుంది. 
కరీంనగర్ లో అప్పుడే నీటి కొరత

గతంలో గ్రామ పంచాయితీగా ఉన్న సమయంలో అప్పటి పాలక వర్గాలు నిధులు ,సిబ్బది పరిమితంగా ఉన్నప్పటికిని తాగునీటి సమస్య ఎదురైన సమయంలో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించే వారు. కాని పస్తుతం 24 విద్యుత్ లైన్ ఉండి,నగరపంచాయితీకి కోట్లది రూపాయల అదాయం సమకురుతున్నా, అవసరమమైన సిబ్బంది ఉన్నా తాగునీటి సమస్యలు తీరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న మిషన్ భగీరథ నీటి పథకం కోసం పాలక వర్గం ఎదురు చూస్తుంది. కాని అప్పటి వరకు ప్రతినిత్యం ఎదురౌతున్న నీటి సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు అరోపిస్తున్నారు. జమ్మికుంట పట్టణానికి నిధుల వరద పారిస్తున్నమని, అనేక అభివృద్ది పనులు చేస్తున్నమని ప్రచారం చేసుకుంటున్న ప్రజా ప్రతినిధులు ప్రధాన తాగునీటి సమస్య వైపు కనే్నత్తి చూడడం లేదని ప్రజలు,మహిళలు దుమ్మేత్తి పోస్తున్నారు. నెలకు రెండుసార్లు వచ్చె నల్లాకు బిల్లులు ఎందుకు వసులు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భగీరథ నీరు సరఫరా అయ్యేంత వరకు పట్టణంలోని తాగునీటి సమస్యపై మంత్రి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment