Breaking News

29/01/2020

లోయలో పడ్డ బస్సు .. ఏడుగురు మృతి

భువనేశ్వర్ జనవరి 29, (way2newstv.in)
ఒడిశాలో బుధవారం తెల్లవారు జామున ఘోర విషాదం నెలకొంది.  గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.   ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.  పలువురికి గాయాలయయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. 
లోయలో పడ్డ బస్సు .. ఏడుగురు మృతి

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.మహరాష్ట్రలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం నాసిక్ జిల్లా మేషి ఫటా సమీపంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు టైరు పంచరు కావడంతో అదుపు తప్పింది. ముందుగా వెళుతున్న ఆటోను వెనుకనుంచి ఢీకొంది. రెండు వాహనాలు రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయాయి. ఘటనలో 23 మృతి చెందగా 31మందికి గాయాలయ్యాయి.

No comments:

Post a Comment