Breaking News

30/01/2020

ఔటర్ లో సింగపూర్ తరహా వర్టికల్ గార్డెన్స్

రంగారెడ్డి, జనవరి 30, (way2newstv.in)
సింగరపూర్ తరహాలో భవనాలపై వర్టికల్ గార్డెన్స్ పెంపకపు పద్దతులను హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలో వెలిసే భవనాల్లోనూ ఏర్పాటు చేసే దిశగా హెచ్‌ఎండిఎ ప్రణాళికలను సిద్దం చేస్తున్నది. భవనాలపై ఈ వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు పద్దతిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండిఎ ప్లానింగ్ అధికారులకు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ఆదేశించినట్టు తెలిసింది. హైదరాబాద్ మహానగర శివారును కాలుష్యం దరిచేరకుండా ముందస్తుగా వర్టికల్ గార్డెన్‌ల పెంపకాన్ని అమలులోకి తీసుకురావాలని మంత్రి కెటిఆర్ ఆదేశించినట్టు తెలిసింది.ఈ గార్డెన్‌ల ద్వారా పచ్చదనం పెరగడం, కాలుష్యం తగ్గడంతోపాటు కూరగాయల దిగుమతి ఉంటుందని మంత్రి అధికారులకు వివరించినట్టు సమాచారం.
 ఔటర్ లో సింగపూర్ తరహా వర్టికల్ గార్డెన్స్

శివారులో ఆకాశ హర్మాలు వెలుస్తున్నాయని, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలోనే వర్టికల్ గార్డెన్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని సూచించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.బహుళ అంతస్థుల భవనాల నిలువు గోడలకు వృక్షసంపదను పండించేట్టుగా ఏర్పాట్లు చేయడం. భవనాల గోడలకు ప్లాస్టిక్, సిథటిక్ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన వాటిల్లో మొక్కలను పెంచడం ద్వారా ఆ భవనాన్ని పచ్చదనంతో నింపివేయడం. వర్టికల్ గార్డెన్‌లు నిలువగా పెంచే తోటలుగా పిలుస్తారు. సింగపూర్ ఉద్యానవనాల దేశం కానప్పటికీ వాణిజ్య నిలువు వ్యవసాయ క్షేత్రాన్ని కలిగిఉన్న దేశం. స్కై గ్రీన్స్ ఫార్మ్ నిర్మించిన సింగపూర్ స్థానికంగా ఆహారాన్ని పెంచడానికి, దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి ఈ వర్టికల్ గార్డెన్స్ ఉపయోగపడుతుంటాయి. సింగపూర్‌లోని వర్టికల్ గార్డెన్ ప్రతిరోజు ఒక టన్నుల తాజా కూరగాయలను మాత్రమే పండిస్తుంది. సింగపూర్‌లో వర్టికల్ గార్డెన్‌లు 1,62,900 మొక్కలు 200 జాతులు, దాదాపు 18 తోటల్లో 12 తోటలు సూపర్‌ట్రీ గ్రోవ్‌లో ఉండగా మిగిలిన ఆరు మాత్రం స్కేర్, డ్రాగన్‌ఫ్లై సరస్సు ప్రాంతంలో ఉన్నాయి.ఈ ఏడాది నుంచి హెచ్‌ఎండిఎ విస్తరిత ప్రాంతంలోని ఆకాశ హర్మాలు, బహుళ అంతస్థులు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వర్టికల్ గార్డెన్‌లు తీసుకురావాలని హెచ్‌ఎండిఎ సన్నాహాలు చేస్తున్నది. ఫలితంగా కూరగాయల కొరత తగ్గించడం, కాలుష్య రహితంగా ఉండటం, ఇతర ప్రాంతాలపై ఆధారపడటం లేకుండా చూడాలని, తద్వారా ఆ ప్రాంతంలో ఆక్సీజన్ శాతాన్ని పెంచాలని ప్లానింగ్ అధికారులు ప్రత్యేక షరతులను రూపొందిస్తున్నట్టు సమాచారం. భవనాల ప్రహారీలు, టెర్రస్‌లు, బాల్కానీలు, స్టేయిర్ కేస్‌లు కూడా మొక్కలతో నిండి పచ్చని అందాలకు కేంద్రంగా భవనాలు ఉండేలా చర్యలు చేపట్టాలని అథారిటీ వర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment