Breaking News

21/01/2020

ఎల్.ఐ.సి రెస్ట్ డే విజయవంతం

కార్పొరేషన్ స్పందించక పోతే ఉద్యమాలను మరింత ఉదృతం
జిల్లా లోని ఎల్.ఐ.సి. కార్యాలయాల ఎదుట ధర్నా
జగిత్యాల జనవరి 21 (way2newstv.in)
భారతీయ జీవిత భీమా సంస్థ ఇప్పటికైనా దిగి రాకపోతే ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని లియాపి జగిత్యాల శాఖ అధ్యక్షులు ఎనుగుర్తి వెంకటస్వామి అన్నారు.
 ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమాఖ్య పిలుపు మేరకు మంగళవారం జగిత్యాల,కోరుట్ల, మెట్ పెల్లి, ధర్మపురి పట్టణాలలోనిఎల్.ఐ.సి. కార్యాలయాల ఎదుట చేపట్టిన రెస్ట్ డే ధర్నా విజయ వంతమైంది. కార్యాలయ పనులు జరుగకుండా అడ్డుకొని లావాదేవీలు స్తంభింప జేశారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది ఈ రోజు పని చేయకూడదని వారి పనులను నిలిపివేశారు. కార్పొరేషన్ తీరుపై, వారి డిమాండ్ల సాధనకై ప్లే కార్డులు ప్రదర్శిస్తూ, పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఎల్.ఐ. సి. సంస్థ వినియోగదారులు వాపస్ తిరిగి వెళ్లిపోయారు. 
ఎల్.ఐ.సి రెస్ట్ డే  విజయవంతం

లియాపి నాయకులు పాలసీ దారులకు దండం పెట్టి ఏమి అనుకోవద్దని, మీ పాలసీ దారుల లాభం కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు. అర్థం చేసుకున్న పాలసీ దారులు సైతం ఏజెంట్ల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు.లియాపి జగిత్యాల శాఖ అధ్యక్షులు ఎనుగుర్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు జగిత్యాల జిల్లా నలుమూలల నుండి భీమా ఎజెంట్లు, కొందరు పాలసీ దారులు కూడా స్వచ్చందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్.ఐ. సి. కార్పొరేషన్ ఇప్పటి కైనా దిగి వచ్చి పాలసీదారులకు బోనస్ పెంచాలని డిమాండ్ చేశారు. పెంచిన ఏజెంట్స్ కమిషన్ వెంటనే అమలు చేయాలని, పాలసీలపై విధించే జిఎస్టీని పూర్తిగా తొలగించాలని, భీమా పాలసీలపై బోనస్ పెంచి పాలసీ దారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మపురి లో జరిగిన ధర్నాలో కోశాధికారి జున్ను మల్లయ్య మాట్లాడుతూ ప్రిమియం పాయింట్ కమిషన్ పెంచాలని, ఏజెంట్ కుటుంబములో అందరికి మెడిక్లైయిం వర్తింప చేయాలని, గ్రాడ్యూటీ పెంచాలి మరియు గ్రాడ్యూటీ లెక్కింపు విధానం మార్చాలన్నారు. టర్మ్ అస్యూరెన్సు పెంచాలని, నాన్ క్లబ్ మెంబెర్స్ కు కూడా మెడిక్లైయిం వర్థింప చేయాలని కోరారు.ఈ ధర్నాలో ప్రధాన కార్యదర్శి పాదం ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్యలతో పాటు ఏజెంట్ల సమాఖ్య నాయకులు గాదె రమేష్, గుండా నాగరాజు, నల్ల సత్తయ్య, మర్రిపెళ్లి సత్యనారాయణ రెడ్డి, బొడ్ల వీరేశం, భారతపు గుండయ్య, ఏలూరి సత్యం, సత్యనారాయణ, చుక్క గంగారెడ్డి, గంగాధర్, ఆముద రాజ్ కుమార్, మహంకాళి ప్రభాకర్, కొక్కు లక్మన్, గంగారెడ్డి, కొలగాని రామచంద్రం, జలపతి, హన్మంత్ రెడ్డి, కనకయ్య, రాజన్న, పైడి మారుతి, వేణుగోపాల్, శంకర్, గౌరీ శంకర్, రాజేశం, వెంకటి, బానుక బుచ్చిలింగం, రమేష్, కమలాకర్, రవి, నర్సయ్య , గంగమల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, బోగ మారుతి, రవీందర్ రెడ్డి, చిలుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా జగిత్యాల బ్రాంచ్ మరియు ధర్మపురి శాటిలైట్ బ్రాంచ్ కార్యాలయాల ముందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఏజెంట్లు, కార్యాలయ సిబ్బందితో కలసి రెస్ట్ డే అనే నినాదంతో ధర్నాను నిర్వహించి విజయవంతం చేశారు.భారీ సంఖ్యలో హాజరైన ఏజెంట్ మిత్రులకు, ధర్నాకు సహకరించిన భారతీయ జీవిత భీమా సంస్థ పాలసీదారులకు, అధికారులకు, సిబ్బందికి లియాపి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment