జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్
వనపర్తి జనవరి 25 (way2newstv.in)
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాఅదనపు ఎస్పీషాకీర్ హుస్సేన్ శనివారం పరిశీలించారు.జిల్లా సాయుధ దళాధిపతి.పరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
గణతంత్ర దినోత్సవానికి పోలీసుల కవాతు సిద్ధం
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ పలు సూచనలు చేశారు.ఆదివారం జరుపుకునే గణతంత్ర వేడుకలలోఘనంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారుల సమన్వయంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేస్తున్నామని అదనపు ఎస్పీ తెలిపారు
No comments:
Post a Comment