Breaking News

31/01/2020

ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

హైదరాబాద్ జనవరి 31 (way2newstv.in)
ఐఐటీ-జేఈఈ ఫోరం ఆధ్వర్యంలో జేఈఈ (మెయిన్ ), అడ్వాన్స్డ్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందజేయన్నట్లు  ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. జేఈఈ (మెయిన్ ) 2020 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్స్, కీ తో సహా విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ను పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉచితంగా అందిస్తారు. 
ఐఐటీ-జేఈఈ ఫోరం జేఈఈ (మెయిన్), అడ్వాన్స్డ్ గ్రాండ్ టెస్ట్స్

అదే విధంగా అడ్వాన్స్డ్ సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్స్ పేపర్ -1, పేపర్ -2, కీ తో సహా  జేఈఈ విద్యార్థుల అవగాహన కోసం ఉచితంగా మొబైల్ వెర్షన్ ద్వారా పిడిఎఫ్ కాపీ ని వాట్సాప్ ద్వారా అందచేస్తారు.ఇటీవల ఆరు సంవత్సరాల పేపర్లను, అవగాహన కోసం ర్యాంకులు తదితర వివరాలను బుక్ లెట్ రూపంలో అందించిన ఐఐటీ-జేఈఈ ఫోరం విద్యార్ధుల సౌకర్యార్ధం ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆసక్తి గల విద్యార్ధులు 98490 16661 కు ‘ గ్రాండ్ టెస్ట్ ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా లలిత్ కుమార్ కోరుతున్నారు.

No comments:

Post a Comment