Breaking News

10/01/2020

కలిసొస్తున్న ఈస్ట్ లుక్ పాలసీ

హైద్రాబాద్, జనవరి 10, (way2newstv.in)
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో రియల్ భూం జోరుమీదున్నది. గతంలో ఎన్నడూ లేనివిధం మగా ఆర్థికమాంద్యంలోనూ ఈ రంగం గణనీయమై న ప్రగతిని సాధిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోన్న గ్రేటర్‌హైదరాబాద్‌కు నలుమూలల నిర్మాణాల జోరు కొనసాగుతున్నది. సం స్థపరంగా శంషాబాద్, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, మేడ్చల్ జోన్ల పరిధిలోని కోకాపేట, మోకిల, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాలగూడ, పెద్ద అంబర్‌పేట, మహేశ్వరం, ఆదిబట్ల, బొంగుళూరు జంక్షన్, తెల్లాపూర్, సాగర్ రోడ్, ఘట్‌కేసర్, ఉప్పల్ టూ భువనగిరి, మేడ్చల్, పరిధిలో కొత్త వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు రియల్‌కళ సంతరించుకుంది. ప్రధానంగా శంషాబాద్, శంకర్‌పల్లి మండలాల పరిధి వైపే రియల్టర్లు మొగ్గు చూపుతున్నారు. 
కలిసొస్తున్న ఈస్ట్ లుక్ పాలసీ

ప్రభుత్వం ఔటర్‌కు నలువైపులా అభివృద్ధి చర్యలు చేపడుతున్నప్పటికీ పశ్చిమాన పెట్టుబడికే బిల్డర్లు ఆసక్తి కనబర్చుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఆదిబట్ల టీసీఎస్, బాటాసింగారం, మంగళ్‌పల్లిలో లాజిస్టిక్ పార్కులు, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్స్ సెజ్, ముచ్చర్లలో ఫార్మాసిటీ, అన్నింటికీ మించి ఐటీ, బహుళ జాతి కంపెనీలు ఉండడంతో బిల్డర్లు కూడా ఇక్కడే నిర్మాణాలు చేపడుతున్నారు.కొనుగోలుదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఆకాశహర్మ్యాలు, మల్టీ సోర్టేజ్ బిల్డింగ్‌లు, లగ్జరీ విల్లాలు, భారీ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. పెట్టుబడులకు అనుగుణంగానూ నూతన వెంచర్లను ఏర్పాటు చేస్తూ రియల్ సత్తాను చాటుతున్నారు. మొత్తంగా పశ్చిమాన కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, గోపన్‌పల్లి, ఆదిబట్ల, బొంగుళూరు, కొంగరకలాన్ తదితర ప్రాంతాలు మినీ నగరాలను తలపిస్తున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన శంషాబాద్, శంకర్‌పల్లిలో రియల్‌రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నదని, ప్రభుత్వం అన్ని వైపులా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ఈస్ట్ లుక్ పాలసీలో భాగం గా ఘట్‌కేసర్, మేడ్చల్ జోన్ వైపు ఇప్పుడిప్పుడే పుం జుకుంటుందని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జీవీ రావు తెలిపారు.శంషాబాద్, శంకర్‌పల్లి వైపు విలాసవంతమైన నిర్మాణాలకు డిమాండ్ ఉందని, గతం లో కంటే ఎంఎస్‌బి (మల్టీస్టోరేజ్ బిల్డింగ్‌లు) పెరిగాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.అమీన్‌పూర్, కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, గోపన్‌పల్లి, ఆదిబట్ల, బొంగుళూరు, కొంగరకలాన్ గ్రామాలు అలనాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తూ నవీన నాగరీకతకు అనుగుణంగా ఊహించని అభివృద్దిని సాధించాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు , పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం, భవిష్యత్తులో మరింత అభివృద్ధికి అస్కారం ఉండడంతో ఈ ప్రాంతాలన్ని ఒక్కసారిగా ఖరీదైన జాబితాలోకి చేరిపోయాయి. వేలల్లో ఎకరం పలికే భూములు రియల్ భూమ్ ఫీవర్‌తో కోట్లలోకి చేరిపోయాయి. ఇప్పటికే వందల సంఖ్యలో అపార్టుమెంట్లు, వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఈ ప్రాం తం లో వెలిశాయి. విల్లాలు, బహుళజాతి సంస్థల భవనా లు కోకోల్లలుగా ఈ ప్రాంతాల్లో ఏర్పాటు కావడం గమనార్హం.

No comments:

Post a Comment