Breaking News

08/01/2020

పారిశుధ్యం, పచ్చదనం పెంపు పై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల, జనవరి 08 (way2newstv.in)
పల్లె ప్రగతి రెండవ విడత కార్యక్రమ అమలులో భాగంగా గ్రామాలలో పారిశుధ్యం,  పచ్చదనం పెంపు పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు.బుధవారం కోనరావుపేట మండలంలోని నాగారం, పల్లిమక్త, కనగర్తి గ్రామాలలో పల్లె ప్రగతి రెండవ విడత కార్యక్రమ అమలును జిల్లా కలెక్టర్ శ్రీక్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సేవకులుగా పనిచేసినప్పుడే గ్రామాలు సత్వర అభివృద్ధిని సాధిస్తాయని, గ్రామాల ప్రజలు సమిష్టిగా ప్రభుత్వ లక్ష్యాల వంద శాతం సాధనకు కృషి చేయాలని సూచించారు .
పారిశుధ్యం, పచ్చదనం పెంపు పై ప్రత్యేక దృష్టి సారించాలి

గ్రామాలలో పచ్చదనం పెంపుతో పాటు పారిశుద్ద్యం మెరుగ్గా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.గ్రామాల పర్యటన లో పారిశుద్ద్యం, మొక్కల పెంపకం, ఇంకుడుగుంతల నిర్మాణం ను పరిశీలించారు. నాగారం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మించిన ఇంకుడుగుంతలను పరిశీలించారు. పల్లిమక్త గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్ పై ఎక్కి నడిపించారు. అనంతరం నర్సరీ ని పరిశీలించి, మొక్కల సంరక్షణ ఎలా ఉంది అని అధికారులను, కూలీలను అడిగి తెలుసుకున్నారు. కనగర్తి గ్రామంలో ప్రధాన రోడ్ల ప్రక్కన చెత్త పారబోసి ఉండడం, మురుగు కాలువలలో, కాలువ ప్రక్కన ప్లాస్టిక్ వ్యర్దాలు ఉండడం గమనించిన జిల్లా కలెక్టర్ గ్రామ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను గుర్తించి తొలగించాలనీ ప్రజా ప్రతినిధులు, కార్యదర్శిని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ 85 శాతం కు పైగా ఉండాలని లేదంటే కార్యదర్శులను విధులనుంచి తప్పి స్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment