Breaking News

07/01/2020

పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

పెద్దపల్లి జనవరి 07  (way2newstv.in)
గ్రామాలో పల్లె ప్రగతి  కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన  అన్నారు.  పెద్దపల్లి మండలంలో  అందుగులపల్లి  గ్రామంలో నిర్వహిస్తున్న  రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ మంగళవారం  పాల్గోన్నారు.    అందుగులపల్లి గ్రామాన్ని పరిశీలించిన కలెక్టర్ స్వచ్చత అంశాలను  పరిశీలించారు.  పంచసూత్రాల అమలు పై స్వశక్తి మహిళా సంఘాలకు, గ్రామస్థులకు కలెక్టర్ పలు సూచనలు చేసారు.  అందుగులపల్లి గ్రామంలో  స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేసామని, సాముహిక మరుగుదొడ్డి నిర్మించి పరిశుభ్రంగా నిర్వహిస్తున్నామని   అధికారులు కలెక్టర్ కు వివరించారు.  పెదపల్లి జిల్లా వ్యాప్తంగా 180 గ్రామాలో స్మశాన వాటిక నిర్మాణ పనులు ప్రారంభించామని, 370 ఎకరాలలో వానర వనాలు ఎర్పాటు చేసామని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు.  
పల్లె ప్రగతి  కార్యక్రమం నిరంతర ప్రక్రియ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

స్వచ్చత అంశంలో మన జిల్లాకు  జాతీయ స్థాయిలో 3 బహుమతులు  లభించాయని, వీటికి అదనంగా 3 గ్రామ పంచాయతిలకు సైతం అవార్డులు లభించాయని అన్నారు.    స్వచ్చత సాధన దిశగా  మన జిల్లాలో నిర్వహిస్తున్న పంచసూత్రాల కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేయాలని  అన్నారు.  మన జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో లక్షకు పైగా ఇంకుడగుంతలను నిర్మించామని, ప్రస్తుతం రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో  రాష్ట్ర వ్యాప్తంగా  ఇంకుడగుంతల నిర్మాణం చేపట్టాల్సిందిగా  సీఎం కలెక్టర్లకు సూచించారని కలెక్టర్ తెలిపారు.  ఇంకుడుగుంతలను నిర్మించడం వల్ల గత వర్షాకాలంలో 271 నమోదైన డెంగ్యు కేసులు ప్రస్తుత వర్షాకాలంలో  కేవలం 41 నమెదయ్యాయని, 85 శాతం మేర తగ్గుదల ఉందని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటిలో కంపొస్ట్ పిట్, కిచెన్  గార్డెన్ ఎర్పాటు చేసుకోవాలని  కలెక్టర్ అన్నారు.  విద్యార్థులు మంచి పౌష్టికాహరం తీసుకోవాలని, ఆకు కూరలు, కాయగురలు, పండ్లు ఆహరంలో అధికంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ప్లాస్టీక్ వినియోగం నిషేదించాలని,రొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రొడ్ల పై చెత్త వేస్తే భారీ జరిమానా వసూళ్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చెత్త నిర్వహణ సమర్థవంతంగా చేయాలని, తడి చెత్త, గాజు, పేపర్, ప్లాస్టిక్, ఐరన్ ప్రత్యేకంగా  విభజీంచి పంచాయతి సిబ్బందికి ప్రతి రోజు అప్పగించాలని కలెక్టర్ సూచించారు.
 *పిల్లల ప్రవర్తన పై ప్రత్యేక శ్రద్ద వహించాలి
* పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రులు సమాజం ప్రత్యేక శ్రద్ద వహించాలని, వారు మంచి మార్గంలో  పయనించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ అన్నారు.   అందుగులపల్లి గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో  నిర్వహించిన స్పృహ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గోన్నారు.   మహిళల  పై  సమాజంలో జరుగుతున్న దాడులకు  నివారించేందకు స్పృహ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు.   స్పృహ కార్యక్రమం కింద   గ్రామాలో ఉన్న నిరక్షరాస్యుల  సర్వే    విద్యనభ్యసించి నిరుద్యోగులను గుర్తించామని,  వారు చిరు వ్యాపారాలు ఎర్పాటు చేసే విధంగా బ్యాంకర్ల సహకారంతో  రుణాలు అందించేలా ప్రణాళిక సిద్దం చేసామని  కలెక్టర్ వివరించారు. స్పృహ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో 3 బృందాలను(విద్యార్థులు, యువత, పెన్షనర్లు) ఎర్పాటు చేసామని,   మహిళల పై దాడుల నివారణ చర్చ జరగాలని, అదే సమయంలో మహిళల పై జరిగే దాడులకు సంబంధించి ఉన్న చట్టాలు, శిక్షల పట్ల అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు.     సమాజంలో మార్పు కోసం ముందు మన ఇంటి స్థాయిలో మార్పు రావాలని, మహిళల పట్ల గౌరవం కల్పించాలని, పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని  కలెక్టర్ సూచించారు.     విద్యార్థి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు అందించడం వల్ల వారి భవిష్యత్తు చెడిపొతుందని, చెడ్డు అలవాట్లకు  బానిస అయ్యే ప్రమాదం అధికంగా ఉందని,  పిల్లలు స్నేహల పట్ల తల్లితండ్రులు గమనించాలని కలెక్టర్ అన్నారు.  స్మార్ట్ ఫోన్లలొని వీడియో గేమ్ లు సైతం చాలా ప్రమాదకరంగా ఉన్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేసారు.   జీవితంలో  ప్రతి ఒక్కరు లక్ష్యం ఎర్పాటు చేసుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలని,  వైఫల్యాలు జీవితంలో సహజమని,  తాను సైతం విదేశాలలో చదువుకునే అవకాశం కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కోల్పోయానని,  నిరాశ చెందకుండా కృషి చేయడం వల్ల కలెక్టర్ స్థాయికి చేరుకున్నాని, అదే విధంగా  విద్యార్థులు సైతం   వైఫల్యాలకు  నిరాశపడకుండా  పట్టుదలతో  కృషి చేయాలని, మంచి సమాజ నిర్మాణ దిశగా మనమంతా ఐక్యంగా కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి చంద్రప్రకాశ్ రెడ్డి,   లీడ్ బ్యాంక్ మేనేజర్  ప్రేమ్ కుమార్,జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్,  గ్రామ సర్పంచ్  , సంబందిత అధికారలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

No comments:

Post a Comment