Breaking News

03/01/2020

ముక్కోటి ఏకాదశితో ఏడు జన్మల పాప నాశనం

తిరుపతి, జనవరి 3, (way2newstv.in)
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. 
ముక్కోటి ఏకాదశితో ఏడు జన్మల పాప నాశనం

ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేయాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని మామిడి తోరణాలతో అలంకరించాలి. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, ఆయన ప్రతిమను పూజించారలి. కొందరి ఇళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకు శాపవిమోచనం కలగడంతో... తమలాగే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో అంధకారంలో కొట్టమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించమని ఆ భగవంతుని వేడుకోవడం ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆలయానికి వెళ్లడం కుదరని పక్షంలో ఉన్నచోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి, శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటే అపార ఫలితం దక్కుతుందని అంటారు. జీవుడి దేహంలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయట. ఈ ఏకాదశ ఇంద్రియాలనూ నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరించాలి. మర్నాడు ఉదయం ఎవరికైనా అన్నదానం చేసిన తర్వాత ఆహారం స్వీకరించాలి.

No comments:

Post a Comment