Breaking News

06/01/2020

గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పునకు రెడీ...

విశాఖపట్టణం, జనవరి 6 (way2newstv.in)
రాజ‌కీయాల్లో అజాగ్రత్తగా ఎలా ఉండ‌కూడ‌దో.. చిన్నపాటి ప‌ద‌వుల కోసం కీల‌క‌మైన స్థానాల‌ను ఎలా వ‌దులుకోకూడ‌దో.. రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చిన నాయ‌కుల‌కు ఎలా దూరం కాకూడ‌దో అనే విష‌యాలు గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పొలిటిక‌ల్ కెరీర్ ప్రత్యక్షంగా నిరూపిస్తుంది. రాజ‌కీయ వార‌స‌త్వం ఉన్నప్పటికీ.. ఆమె ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకోలేదు. ప్రభుత్వ టీచ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈశ్వరి.. అనూహ్యంగా జ‌గ‌న్ వైపు అడుగులు వేశారు. జ‌న‌తా పార్టీ త‌ర‌పున 1978లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గిడ్డి ఈశ్వరి తండ్రి గిడ్డి అప్పల‌నాయుడు పోటీ చేసిన విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత గిడ్డి కుటుంబం నుంచి ఎవ‌రూ రాజకీయాల్లోకి రాలేదు.టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఈ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించింది. 
గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పునకు రెడీ...

టీడీపీ ఆవిర్భవించిన తొలి సంవ‌త్సరం వ‌చ్చిన ఎన్నిక‌ల్లోనే ఈ నియోజ‌వ‌క‌ర్గం ప్రజ‌లు టీడీపీకి జైకొట్టి.. ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇక‌, ఇప్పటి వ‌ర‌కు నాలుగు సార్లు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కిన రికార్డును టీడీపీ ద‌క్కించుకుంది. రెండు సార్లు కాంగ్రెస్‌, ఒక‌సారి జ‌న‌తా పార్టీ ఇక్కడ విజ‌యం సాధించాయి. 2004 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రాష్ట్రంతో సంబంధం లేని బీఎస్పీ కూడా ఇక్కడ విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, 2014, 2019లో ఇక్కడ వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, 2014లో అనూహ్యంగా టీచ‌ర్‌గా ఉన్న గిడ్డి ఈశ్వరికి జ‌గ‌న్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆయ‌న‌పై అభిమానంతో గిడ్డి ఈశ్వరి అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇక‌, 2017లో చంద్రబాబు విసిరిన ఆక‌ర్ష్ మంత్రంతో గిడ్డి ఈశ్వరి కూడా పార్టీ మారిపోయారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్సన్ లేదా, మంత్రి ప‌ద‌విని ఆమెకు ఇస్తార‌నే హామీ ఉంద‌ని, అందుకే ఆమె పార్టీ మారార‌ని ప్రచారం జ‌రిగింది. అయితే, అనూహ్యంగా ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గం కార్యక‌ర్తల‌తో మాట్లాడిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో చంద్రబాబు ఆమెకు ఇచ్చిన హామీని ప‌క్కన పెట్టారు. దీంతో గిడ్డిఈశ్వరికి ఆశాభంగ‌మే ఏర్పడింది. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఆమెకు టికెట్ ల‌భిం చింది. అయితే, 2014తో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్నిక‌ల్లో గిడ్డి ఈశ్వరి అతి క‌ష్టంమీద డిపాజిట్ ద‌క్కించుకున్నా.. ఘోరంగా ఓడిపోయారు.గ‌త ఎన్నిక‌ల్లో దూకుడు ఉన్న నాయ‌కురాలు.. తాజా ఎన్నిక‌ల్లో పూర్తిగా డీలా ప‌డ్డారు.. ఇప్పుడు పార్టీలోనూ యాక్టివ్‌గా లేరు. వైసీపీలోకి రావాల‌ని ఉన్నా.. వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక్కడ నుంచి గెలిచిన కొట్టంగుళ్ల భాగ్యల‌క్ష్మి జ‌గ‌న్ ఆద‌ర్శాల‌ను, ల‌క్ష్యాల‌ను ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. దీనికి తోడు కుటుంబంలో చెల‌రేగిన క‌ల‌హాల‌తో గిడ్డి ఈశ్వరి స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అంటున్నా రు. ఇక‌, చంద్రబాబు కూడా వీరిని ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌ధ్యలో ఆమె వైసీపీలోకి వెళ్లే ప్రయ‌త్నాలు చేసినా అక్కడ వారు ఎవ్వరూ ప‌ట్టించుకోలేదు. ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీకి తిరుగులేని బ‌లం ఉన్న నేప‌థ్యంలో టీడీపీలో ఉన్నా ఒక‌టే.. లేక‌పోయినా ఒక‌టే అన్న నిర్ణయానికి ఆమె వ‌చ్చేశార‌ని టాక్‌..? ఈ నేప‌థ్యంలో ఆమె దాదాపు ఇక‌, రాజ‌కీయాల‌కు దాదాపు దూర‌మైన‌ట్టే అంటున్నారు.

No comments:

Post a Comment