వరంగల్ అర్బన్ (హసన్ పర్తి)
జనవరి 11 (way2newstv.in)
గ్రామాల్లో పల్లె ప్రగతి నిర్దేశించిన పనులను పూర్తి చేస్తేనే గ్రామ అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. శనివారం రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హసన్ పర్తి మండలం లోని హరిశ్చంద్ర పురం తండా, సిద్దాపురం మల్లారెడ్డి పల్లి కొత్త పల్లి గ్రామంలో పనుల ను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కావాలంటే గతంలో మంజూరైన పనులను పల్లె ప్రగతిలో నిర్దేశించిన అంశాలను పూర్తి చేస్తున్నప్పుడే ప్రజలకు సౌకర్యానికి సంభందించిన పనుల కోసం నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి అందరు సమిష్టిగా పని చేయలని గ్రామాల్లో ఏలాంటి రాజకీయాలు లేకుండా ప్రజల కనీస అవసరాల కోసం తీర్చేందుకు ముందుకు రావాలని చెప్పారు.
గ్రామాభివృద్దికి సమిష్టి కృషి
పల్లె ప్రగతి గ్రామాల సమూల మార్పుల కోసమే నని రాష్ట్ర ప్రభుత్వం మంచి దృక్పథం తో శ్రీకారం చుట్టినందున అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సమిష్టి కృషి తో పల్లె లను ప్రగతి పథంలో ముందుంచేందుకు బాధ్యత గా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామ అభివృద్ధిలో రాజకీయాలు ఉండవద్దని వాటిని ప్రోత్సహించే వారి పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు అందరి సహకారం తో ప్రగతికి తోడ్పాటు నందిచలని కలెక్టర్ అన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ హసన్ పర్తి మండలంలోనీ హరిషంద్ర పురం తండా పర్యటించారు గ్రామంలో విద్యుత్ బిల్లులు చెల్లించే బాధ్యత ఉప సర్పంచ్ సెక్రెటరీ దే మొదటి విడత పల్లె ప్రగతి నుండి బిల్లు లు చెల్లించాలని ఆదేశించారు ఇప్పటి కి చెల్లించని పక్షం లో తొందరగ చెల్లించాలని కార్యదర్శిని ఆదేశించారు . కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ప్రతిపాదనల పంపించాలని అన్నారు.సోప్ ఫిట్ పనులు ప్రారంభించిసోప్ ఫిట్ అన్నింటినీ పూర్తి చేయాలని అన్నారు. తురక కుంట కెనాల్ వాటర్ రావడం లేదు రేషన షాపు ఏర్పాటు చేయాలి గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించారు. నర్సరీ నీ పరిశీలించి గ్రామ గ్రీన్ ప్రణాళిక ప్రకారంగా పండ్ల విత్తలను సేకరించి మొక్కలను తయారు చేయాలని అన్నారు నర్సరీ సిద్దాపురం తండా కు కలిసి ఏర్పాటు చేసినందున నర్సరీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరగా ప్రతిపాదనలు పంపిస్తే నిధులను మంజూరు చేస్తానని ట్రాన్స్ కో ఏ ఈ నీ ఆదేశించారు. సిద్దాపురం గ్రామంలో పాత సర్పంచ్ ఈ శ్వరమ్మా వైకుంఠ దమా ము నిర్మాణా పనులను చేపట్టడం లేదని పూర్తి నిధులు మంజూరు కూడా చేశామని ఎన్నో సార్లు చెప్పినా పనులను చేపట్టడం లేదని ఎంపీడీఓ కలెక్టర్ కు పరిశీలన సందర్భం వివరించగా ఆమె ను పిలిపించి సెటిల్ చేయలని అక్కడే ఉన్న హసన్ పర్తి యస్ ఐ నీ ఆదేశించారు గ్రామానికి వెళ్ళిన తర్వాత వైకుంఠ దమాము నిర్మాణా పనుల ఫిబ్రవరి15 లోగా పూర్తి చేయని పక్షంలో లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆమెను హెచ్చరించారు ఇంకుడు గుంతలు వంద శాతం పూర్తి చేస్తేనే పాఠశాల కాంపౌండ్ వాల్ కు నిధులను. మంజూరు చేస్తామని చెప్పారు సందర్భంగా అర్వపల్లి, సిద్దాపురం గ్రామాలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను కలెక్టర్ ప్రారంభించారు. మల్లారెడ్డి పల్లి లో పట్టే దారు పాసు పుస్తకాలు ఇంకా 75 శాతం పంపిణీ చేయలేదని మోక మీద ఒకరు ఉంటే పట్ట పుస్తకాలు ఇంకొకరి పేరున వస్తున్నాయని కలెక్టర్ కు విన్నవించారు భూముల సమస్య పరిష్కారం పై వచ్చే సోమవారం ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేస్తా నన్నారు .వైకుంఠ దానము నిర్మాణా పనులను మార్చి 15 పూర్తి చేయాలని స్థలం దానం చేసిన దాత పేరు పెట్టాలని ఆదేశించారు.కొత్తపల్లి కో పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల కిచెన్ గార్డెన్ పరిశీలన మధ్యాహ్న భోజనం పై విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.వచ్చే విద్య సంవత్సరం లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు.కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి తహశీల్దార్ ఎంపీడీఓ ఎంపీ ఓ ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment