Breaking News

20/01/2020

ఘనంగా పుల్లూరు బండ జాతర: మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట జనవరి 20  (way2newstv.in)
 పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మి నృసింహస్వామి జాతర ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు జరుగును. పల్లె జాతరకు తలమానికంగా ప్రసిద్ధి చెందిన పుల్లూరు బండ జాతర పోస్టర్‌ను సిద్ధిపేటలోని తన నివాసంలో మంత్రి హరీష్‌రావు సోమవారం ఆవిష్కరించారు. జాతరకు రావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు మంత్రిని ఆహ్వానించారు. 
ఘనంగా పుల్లూరు బండ జాతర: మంత్రి హరీష్‌ రావు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జాతరకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. త్రాగునీరు, రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కలకుంట్ల రంగాచారి, సర్పంచ్‌ నరేష్‌ గౌడ్‌, వంశపారంపర్య అర్చకులు రామకృష్ణమాచార్యులు, ఉప సర్పంచ్‌ ప్రసాద్‌, కో ఆప్షన్‌ సభ్యులు నర్సింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌, వెంకట్‌, ప్రదీప్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment