Breaking News

07/01/2020

నట్టింట్లో మండుతున్న ఆయిల్

వరంగల్, జనవరి7  (way2newstv.in)
వంటింటి సరుకులకు ధరల మంట కొనసాగుతోంది. మొన్న కూరగాయలు, నిన్న ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటగా.. నేడు వంట నూనెల ధర కూడా వాటికి తోడయింది. గత ఏడాది కురిసిన అకాల వర్షాలకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మిగతా రాష్ట్రాల్లో సోయాబీన్ పంట దెబ్బతింది. సోయాబీన్ ప్రాసెసింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం.. గతేడాది సోయాబీన్ ఉత్పత్తి 109 లక్షల టన్నులకు పైగా ఉంది. ఈ ఏడాది మాత్రం కేవలం 89 లక్షల టన్నులు మాత్రమే. దీంతో పాటు పామాయిల్, వేరుశనగ పంటల ఉత్పత్తి కూడా తగ్గింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. 2018లో దేశవ్యాప్తంగా రైతులు అన్ని రకాల నూనె పంటలను 68 లక్షల హెక్టార్లలో సాగు చేశారు.
నట్టింట్లో మండుతున్న ఆయిల్

ఈ ఏడాది అందులో 2.5 లక్షల హెక్టార్లు తగ్గింది. ఫలితంగా ఉత్పత్తి కూడా ఆ మేరకు తగ్గి, వంట నూనెల ధరలు దాదాపు 20 నుంచి 30 శాతం పెరిగాయని వ్యాపారులు చెప్పారు.రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు, వ్యాపారులు చెబుతున్నారు. పెరిగే ధరల ప్రభావం హోటళ్లు, చిరు వ్యాపారులపైనే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ఇళ్లల్లో ఎక్కువగా సన్ఫ్లవర్ అయిల్, హోటళ్లలో పామ్ అయిల్, పల్లి నూనెను ఎక్కువగా వాడుతున్నట్లు ఆయిల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.2019లో అన్ని నూనె గింజల ఉత్పత్తి తగ్గింది. మరోవైపు దిగుమతి చేసుకొనే నూనెపై సుంకం పెరగడంతో ధరలు పెం చారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవ కాశం ఉంది. గత 2 నెలల కంటే సుమారు 20 నుంచి 30 శాతం ధరలు పెరిగాయి.

No comments:

Post a Comment