Breaking News

21/01/2020

రాజధాని అమరావతిలోనే ఉంటుంది :

పవన్ ధీమా వెనుక రీజన్ ఏంటీ
హైద్రాబాద్, జనవరి 21 (way2newstv.in)
మూడు రాజధానులపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ.. వారి పార్టీ వినాశనానికి పునాది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమన్నారు. ఒకవేళ కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్ల.. రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవన్నారు.బీజేపీ అగ్ర నాయకత్వం తనకు ఒకటే చెప్పింది.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే అది ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారన్నారు. 
రాజధాని అమరావతిలోనే ఉంటుంది :

రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్దిస్తున్నామని.. కానీ వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకం అన్నారు. మూడు రాజధానుల అంశం అచరణీయం కాదని అభిప్రాయపడ్డారు. రాజధాని అంటే టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు ఆటైపోయిందని.. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే.. ఇప్పుడు రాజధానిని మార్చి వైఎస్సార్‌సీపీ రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు.అమరావతి రైతులకు అండగా ఉన్న జనసేన వీర మహిళలపై పోలీసులు దాడులు చేశారని మండిపడ్డారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ రైతులను పరామర్శిస్తానంటే లా అండ్‌ ఆర్డర్‌ పేరు చెప్పి పర్మిషన్‌ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం తీరుతో పోలిసులు ఇబ్బందులు పడుతున్నారని.. రోజుల తరబడి కుటుంబాలను విడిచి రోడ్ల వెంట తిరగడంతో పాటు మహిళలతో తిట్లు తినే స్థాయికి పోలీస్‌ వ్యవస్థని ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే ఇలానే చేశారా.. ఒక్క క్షణం సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయిదాటిపోతాయన్నారు. లా అండ్‌ అర్జర్‌ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఆగాను అన్నారు.గతంలోనే తాను ఇంతపెద్ద రాజధాని అవసరం లేదని చెప్పానని పవన్ గుర్తు చేశారు. 10 నుంచి 14 వేల ఎకరాలు రాజధానికి సరిపోతయాని.. టీడీపీ ప్రభుత్వం తన మాటలు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో ఏకంగా రాజధానినే మార్చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజధాని మార్పు జరిగితే.. రాజధాని గ్రామాల్లో 7 వేలమంది పోలీసులు ఎందుకు అని ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతు రోడ్డున పడ్డారన్నారు.విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న రాజధానులు ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు అన్నారు జనసేనాని. ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని.. నిజానికి ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధినే కానీ ప్రభుత్వ కార్యాలయాలు కాదు అన్నారు. రాయలసీమ ప్రాంతవాసులకు విశాఖపట్నం దూరాభారం అని తెలిసినా అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం వెనుక వైసీపీకి ఉన్నది ఆపేక్ష కాదు.. స్వలాభాపేక్షన్నారు. పుష్కలంగా ఉన్న భూ సంపదను చేజిక్కించుకోవడమే వైఎస్సార్‌సీపీ పెద్దల అసలు వ్యూహం. అన్నారు ప్రశాంతతకు మారుపేరయిన విశాఖపట్నాన్ని ఫ్యాక్షనిస్టుల నుంచి జనసేన-బీజేసీ పార్టీలు కాపాడుకుంటాయని చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment