ఏ.ఆర్ పోలీసు సిబ్బందికి రెండు వారాల " డీ మొబలైజేషన్ " కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ
అనంతపురం జనవరి 20 (way2newstv.in)
విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఏ.ఆర్ పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు రెండు వారాల పాటు " డీ మొబలైజేషన్ " కార్యక్రమం సోమవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ప్రారంభమయ్యింది. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఏ.ఆర్ ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏ.ఆర్ సిబ్బందికి ప్రతీ ఏటా డీ మొబలైజేషన్ కార్యక్రమం నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని మెరుగైన సేవలందించండి
అంతేకాకుండా...ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలిచ్చే విధంగా సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బి.డి టీం, ప్రిజనర్స్ ఎస్కార్ట్ , పి.ఎస్ .ఒ లు, డ్రైవర్స్ , తదితర సిబ్బంది బాగా మెరుగుపరుచుకోవాలన్నారు. ఫైరింగ్ , డ్రిల్ , కవాతు, మాబ్ కంట్రోల్ , ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా తర్ఫీదునిస్తారన్నారు. ఇదే సమయంలో ... డీ మొబలైజేషన్ కు వచ్చిన సిబ్బంది ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పరిపాలన పరంగా ఏవేని సమస్యలుంటే పై అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏ,ఆర్ డీిఎస్పీ ఎన్ మురళీధర్ , ఆర్ .ఐ లు వెంకటేశ్వరరావు, ఆనంద్ రెడ్డి, పెద్దయ్య, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, జాఫర్ , సుధాకర్‌రెడ్డి, పలువురు ఆర్‌ఎస్‌ఐలు, ఎఆర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment