శ్రీకాకుళం జనవరి 6 (way2newstv.in)
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం గుండా అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అనంతరం గరుడ వాహనంపై స్వామి వారిని నాలుగు మాడ వీధులు ఘనంగా తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అరసవెల్లిలో భక్తుల రద్దీ
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఇప్పిలి రాజేశ్వర కాశ్యప నగేష్ శర్మ, రంజిత్ శర్మ, సందీప్ శర్మ, ఫనీంద్ర శర్మ తదితరుల అర్చక బృందం స్వామివారికి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపం లో వైకుంఠ ఏకాదశి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment