Breaking News

04/01/2020

అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ

కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల జనవరి 4  (way2newstv.in)
ప్రపంచంలో అంధత్వాన్ని జయించి, అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు.  జిల్లా వయోవృద్ధులు , దివ్యాంగుల శాఖ  ఆధ్వర్యం లో లూయిస్ బ్రెయిలి 211 వ జన్మదిన వేడుకలను కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలకు కలెక్టర్  ముఖ్య అతిధిగా హాజరై  కేక్ కట్ చేసారు.  అనంతరం   హాజరైన వారిని ఉద్దేశించి   ప్రసంగించారు. లూయిస్ బ్రెయిలి చిన్నప్పుడు కంటికి దెబ్బ తగలడం వల్ల అందత్వం ఏర్పడిందని అంధులకు లూయిస్ బ్రెయిలి.. బ్రెయిలి లిపి ద్వారా 6 చుక్కల ద్వారా చదువుకునేల ఏర్పాటు చేశాడని తెలిపారు. 
అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ

ప్రస్తుత సమాజంలో అన్నింట్లో మార్పు వేగంగా వస్తుందని పేర్కొన్న కలెక్టర్,  సుమారు 200 ఏండ్ల క్రితం లూయిస్ అంధుల కోసం కనుగొన్న  బ్రెయిలి లిపి ఇప్పటికీ ఇప్పటికి అంధుల కు ప్రయోజనకారిగా ఉండడం గొప్ప విషయం అన్నారు . దూరదృస్టి తో అంధులకు ఉపయోగకరంగా మలిచారని అన్నారు . వారు చూపిన బాటలో సమాజంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ దివ్యాంగులకు ఇతోధిక సహాయం , సహకారం అందించాలన్నారు .జిల్లా సంక్షేమ అధికారి , ప్రత్యేక అధికారి శ్రీ రాహుల్ శర్మ మాట్లాడుతూ అందుడుగా ఉండి తన లాంటి అంధుల బాధలను అర్థం చేసుకొని అంధుల లిపి తయారు చేయడం గొప్ప విషయం అన్నారు . తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకొవాలన్నారు .అనంతరం కలెక్టర్ ,ప్రత్యేక అధికారి  బ్రెయిలీ సంక్షిప్త జీవిత చరిత్ర , దైనందిని ని ఆవిష్కరించారు.

No comments:

Post a Comment