Breaking News

11/01/2020

మున్సిపల్ ఎన్నికల పాలితాల పైనే మంత్రి మల్లారెడ్డికి బావితవ్యం!

హైదరాబాద్ జనవరి 11  (way2newstv.in)
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిదంటే ఇదే.. ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు మంత్రి మల్లారెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. అవును.. తెలంగాణలో ఏమంత్రికి లేని కష్టాలు మంత్రి మల్లారెడ్డికి వచ్చాయని ఆయన తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఆయనకు పక్కలో బల్లెంలా ఆయన స్థానం నుంచి గెలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి ధీటుగా ఉన్నాడు..మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డికి మున్సిపల్ ఎన్నికల వేళ విషమపరీక్ష ఎదురవుతోంది. రేవంత్ రెడ్డి గులాబీ పార్టీలో అసంతృప్తులను లాగడం.. కాంగ్రెస్ బీఫాం టికెట్ ఇచ్చి పోటీచేయించే పనిలో ఉండడంతో మంత్రి మల్లారెడ్డి టెన్షన్ పడుతున్నాడు. వెంటనే వారి వద్దకు వెళ్లి బుజ్జగింపులు చేస్తున్నాడు.
మున్సిపల్ ఎన్నికల పాలితాల పైనే మంత్రి మల్లారెడ్డికి బావితవ్యం!

మల్కాజిగిరి ఎంపీ సీటును గెలిపించాలని కేసీఆర్.. ఏరికోరి మల్లారెడ్డి అల్లుడికే సీటు కేటాయించారు. తన ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డిని ఓడించాలని అన్ని అండదండలు ఇచ్చారు. కానీ మల్లారెడ్డి విఫలమయ్యారు. ఎంపీగా రేవంత్ రెడ్డి గెలవడంతో కేసీఆర్ ఆగ్రహించారు. ఇక కార్మిక ఉపాధి కల్పన-మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు అస్సలు బాగా లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మొన్నటి కేబినెట్ విస్తరణలోనే మంత్రి మల్లారెడ్డి పోస్టు ఊస్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎందుకో కేసీఆర్ ఆగారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పరీక్ష పెట్టారు. అది పాస్ అయితే మల్లారెడ్డి ఉంటారు.. లేకపోతే మాజీ మంత్రి అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేనంతగా మల్లారెడ్డిలో కంగారు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది.

No comments:

Post a Comment