Breaking News

23/01/2020

తెలంగాణలో కరెంట్ ఓవర్ లోడింగ్

నిజామాబాద్,జనవరి 23, (way2newstv.in)
కొత్త మీటర్‌ బిగించిన కొద్దిరోజుల్లో మళ్లీ అవే సమస్యలు పునరావృతమౌతున్నాయి. సమస్య వచ్చిన ప్రతిసారీ వినియోగదారుడి జేబుకి చిల్లు పడుతోం ది. మీటర్లు సరఫరా చేసే కంపెనీలకు మాత్రం దండిగా కాసుల వర్షం కురుస్తోంది. కరెంటు మీటర్లలో నాణ్యత ఉన్నా లేకున్నా 'లాగ్‌బుక్స్‌'లో మాత్రం 'ఓవర్‌లోడింగ్‌' పేరుతో సదరు కంపెనీల ను విద్యుత్‌సంస్థలు గట్టెక్కించేస్తున్నాయి. దీంతో వారం టీ గడువు ఉన్నా 'రీప్లేస్‌మెంట్‌' చేసే బాధ్యతల నుంచి కంపెనీలు తప్పుకుం టున్నాయి. ఓవర్‌లోడింగ్‌ వల్ల మీటర్లు కాలిపోవడంతో డిస్కంలు తప్పంతా తమదేనని అంగీకరిస్తున్నాయి. ఓల్టేజ్‌ లెవల్స్‌ను సక్రమంగా నియంత్రించకపోవడం వల్ల ఈ తరహా సమస్యలు ఏర్పడుతున్నాయని డిస్కంల అధికారులు చెప్తున్నారు. 
తెలంగాణలో కరెంట్ ఓవర్ లోడింగ్

మరి సర్కారు చెప్తున్న 'నాణ్యమైన విద్యుత్‌' సరఫరా ఎటు పోతోందనే ప్రశ్నలకు సమాధానాలు కనిపించట్లేదు. కాలిపోతున్న మీటర్లన్నీ గృహ వినియోగ కేటగిరి (ఎల్‌టి-1)కి చెందినవే కావడం గమనార్హం. 2018-19 డిస్కంల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎల్‌టి డొమెస్టిక్‌ కేటగిరిలో 54,26,404 మీటర్లు ఉన్నాయి. వీటిలో గడచిన రెండేండ్లలో 11,48,713 (21.17 శాతం) మీటర్లు కాలిపోవడం, తిరగకపోవడం వంటి కారణాలతో రీప్లేస్‌మెంట్‌ చేశారు. దక్షిణప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 5,41,723 మీటర్లు, ఉత్తరప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) పరిధిలో 6,06,990 మీటర్ల రీప్లేస్‌మెంట్‌ జరిగింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఈ తరహా రీప్లేస్‌మెంట్స్‌ అత్యధికంగా ఉన్నాయి. డిస్కం పరిధిలోని మొత్తం రీప్లేస్‌మెంట్‌ మీటర్లలో ఈ రెండు జిల్లాల్లోనే 84,128 (గృహవినియోగం-ఎల్‌టి-1 కేటగిరి) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం నల్గొండ జిల్లాది. ఇక టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని నిజామాబాద్‌ జిల్లాలో రెండేండ్లలో 1,31,508 మీటర్లను రీప్లేస్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చితే నిజామాబాద్‌ జిల్లా రీప్లేస్‌మెంట్సే అత్యధికంగా ఉండటం గమనార్హం. గృహ వినియోగ మీటర్లు కాలిపోవడానికి ఎర్తింగ్‌ సరిగా లేకపోవడమే కారణమని, వాటిని అమర్చాల్సిన బాధ్యత విద్యుత్‌ పంపిణీ సంస్థలదేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఓల్టేజ్‌ హెచ్చుతగ్గులతో కూడా మీటర్లు తిరగకుండా నిలిచిపోవడం, కాలిపోవడం జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సమస్య అన్ని కేటగిరీల విద్యుత్‌ సరఫరాకు లేకుండా, కేవలం డొమెస్టిక్‌ కేటగిరికే పరిమితం కావడంపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఓవైపు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ను 24గంటల పాటు సరఫరా చేస్తున్నామని చెప్తున్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు డొమెస్టిక్‌ కేటగిరి మీటర్లు ఎందుకు కాలిపోతున్నాయనేది అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) 2017-18 టారిఫ్‌ ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా కరెంటు మీటర్లు పనిచేయకుంటే సదరు వినియోగదారుడి నుంచి కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయాలని, మిగిలిన ఆర్ధిక భారాన్ని డిస్కంలు భరించాలని స్పష్టంగా పేర్కొంది. మీటర్ల మార్పిడిని ప్రభుత్వం ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఒక్కో మీటర్‌ మార్పిడికి గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా రూ.100 నుంచి రూ.150 వరకు డిస్కంలు ఈ ఏజెన్సీలకు చెల్లిస్తాయి. మీటర్ల కొనుగోళ్లు మాత్రం డిస్కంలే చేస్తాయి. అయితే వినియోగదారుల నుంచి ఏజెన్సీలు రూ.500 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డిస్కంలు టెండర్ల ప్రక్రియ ద్వారా కరెంటు మీటర్లను కొనుగోలు చేస్తాయి. వాటి గడువు ముగియడంతో కొద్ది కాలంగా నామినేషన్‌ పద్ధతిలోనే మీటర్లను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో భారీగా అవినీతి చోటుచేసుకుంటుం దనే అనుమానాల్ని విద్యుత్‌ సంస్థల్లోని కొందరు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మీటర్లు మార్పిడి చేసే ప్రయివేటు ఏజెన్సీలు కూడా విద్యుత్‌ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధుల బినామీలే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కరెంటు మీటర్ల అవినీతి వ్యవహారం చడీచప్పుడు లేకుండా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏటా 10 శాతానికి పైగా గృహ వినియోగ కేటగిరి కరెంటు మీటర్ల రీప్లేస్‌మెంట్‌ వెనుక భారీ అవినీతి కుంభకోణమే ఉన్నదని ఓ రాజకీయపార్టీ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. డొమెస్టిక్‌ కేటగిరి మీటర్లతో పోల్చితే త్రీఫేజ్‌ మీటర్ల రీప్లేస్‌మెంట్‌ తక్కువగా ఉంది. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో సింగిల్‌ఫేజ్‌ మీటర్ల రీప్లేస్‌మెంట్‌ 2,94,622 కాగా త్రీఫేజ్‌ మీటర్లు 21,310 రీప్లేస్‌మెంట్‌ జరిగాయి. 2015 సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి 2017 సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు లభించిన గణాంకాల్లో ఈ మీటర్ల రీప్లేస్‌మెంట్‌ వ్యవహారం బయటపడింది. విద్యుత్‌ సంస్థలు తమ అంతర్గత సామర్ధ్యాన్ని పెంచుకోవాలని, నష్టాలను నివారించుకోవాలని టీఎస్‌ఈఆర్సీ ప్రతిసారీ హెచ్చరిస్తూనే ఉంది. అయితే దీన్ని డిస్కంలు పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు గత ఏడాదితో పోల్చితే...అంటూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి అర్ధభాగం వివరాలను మాత్రమే టీఎస్‌ఈఆర్సీకి నివేదిస్తున్నాయి. దీనివల్ల గణాంకాల లెక్కింపులో తీవ్ర గందరగోళం నెలకొంటోంది.

No comments:

Post a Comment