విజయవాడ, జనవరి 20 (way2newstv.in)
అవును..! ఇప్పుడు టీడీపీ నేతలు ఏ ఇద్దరు కలిసినా అంటున్న మాట ఇదే.. చంద్రబాబుకు పరీక్షా కాలం ప్రారంభమైందనే. వాస్తవానికి ఆయనకు గత ఏడాది జరిగిన ఎన్నికలే పరీక్షా కాలమని అప్పట్లోనే ప్రచారం జరిగింది. నిజంగానే పరీక్షాకాలాన్ని తాను ఎదుర్కొంటున్నానని ఆయన బహిరంగ వేదికలపైనే చెప్పకొచ్చా రు. కేంద్రం సహకరించదు.. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అప్పట్లో చంద్రబాబును సపోర్టు చేయని పరిస్థితి వెరసి అధికారం నిలబెట్టుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. అయితే, ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఆయనకు అధికారాన్ని నిలబెట్టలేక పోయాయి. దీంతో ఘోర ఓటమిని ఆయన చవిచూశారు.కట్ చేస్తే.. ఇప్పుడు ఎన్నికలకు ముందున్న పరిస్థితే చంద్రబాబుకు ఎదురైంది.
చంద్రబాబుకు పరీక్షా కాలం
అయితే, ఇప్పుడు పార్టీలు ఆయనకు కలిసి వస్తున్నా, అధికారం చేతిలో లేకపోవడం ప్రాంతాల వారీగా పార్టీపై పట్టుకోల్పోవడం, ప్రజల్లోనూ మూడు రాజధానులు ఉంటే తప్పేంటనే భావనను జగన్ ప్రభుత్వం బలంగా తీసుకు వెళ్లడం, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మౌనం వహించడం, ఓ వర్గం మాత్రమే చంద్రబాబు చెంతన నిలవడం వంటి పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడు కూడా చంద్రబాబుకు అగ్ని పరీక్షే ఎదురైందని కొందరు అంటే.. అసలు సిసలు పరీక్ష ఇదేనని మరికొందరు వాదిస్తున్నారు.చంద్రబాబు కలల రాజధాని.. టీడీపీకి చరిత్రను తిరగరాసే రాజధాని నగరం అమరావతి రూపు రేఖలు కోల్పోయేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉందనేది కొందరివాదన. సోమవారం అసెంబ్లీ భేటీకానుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులపై జగన్ సర్కారు ఆమోదం పొందే అవకాశం ఉంది. అసెంబ్లీలో చేసిన తీర్మానాలను న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉండదు కాబట్టి ఇక, చంద్ర బాబు ఏదైనా రాజధాని విషయంలో తేల్చుకోవాలని అనుకుంటే ఇప్పుడే ఆయనకు అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని విధాలా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు. సో.. మొత్తానికి చంద్రబాబు కలల కోటకు బీటలు పడడంతోపాటు ఆయన పార్టీకి కూడా తీరని దెబ్బేనన్నది పరిశీలకుల మాట. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో ? చూడాలి.
No comments:
Post a Comment