Breaking News

24/01/2020

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ బాలికల దినోత్సవం

ఆపదలో ఉన్నప్పుడు 100  సద్వినియోగం చేసుకోవాలి
భూదాన్ పోచంపల్లి  జనవరి 25 (way2newstv.in)
పోచంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఈ శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన షీ టీం సంబంధించిన పోలీస్ అధికారి సలీం ఉపన్యాసం మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని ముఖ్యంగా బాలికలు సంరక్షణ విద్య వికాసం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఇది అన్ని వేళలా ఆహ్వానించదగ్గ విషయం అని అన్నారు. 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ బాలికల దినోత్సవం

నేటి సమాజం పై టీవీ సెల్ ఫోన్స్ ప్రభావం చాలా ఉందని వాటి వలన మంచి విషయాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు 100 నెంబర్ కి ఫోన్ చేసి సహకారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు కాశయ్య గౌడ్ నరేందర్ శివలింగం స్వాతి పాఠశాల ఉపాధ్యాయులు అచ్చయ్య వెంకటనారాయణ జ్ఞానేశ్వర్ రెడ్డి బాల గంగాధర్ రెడ్డి గోపయ్య అంజయ్య కవిత ప్రేమలత నవ్య స్వాతి బ్రహ్మచారి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment