ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వజం
యాదగిరిగుట్ట జనవరి 27 (way2newstv.in):
కేసీఆర్, కేటీఆర్ లు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇచ్చారని అయితే చైర్మన్ పదవి దక్కించుకోవడానికి వరంగల్ కు చెందిన కడియం శ్రీహరితో ఎక్సఫిషియో ఓటును యాదగిరిగుట్టలో చేర్పించారని అన్నారు.అక్రమ మార్గంగా యాదగిరిగుట్ట లో మునిసిపల్ ఛైర్మెన్ పదవిని దక్కించుకోవలని టి ఆర్ ఎస్ చూస్తుందని ఆయన అన్నారు.
పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నా కేసీఆర్, కేటీఆర్
లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇలాంటి వాళ్ళను కాల్చి చంపిన తప్పు లేదని ఆయన ఆవేశంగా అన్నారు. యాదగిరిగుట్ట లో ఎమ్మెల్యే అక్రమ భూ దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే విధంగా తుర్కపల్లి లో కేసీఆర్ కూతురు కవిత అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన అన్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ 12 సార్లు యాదగిరిగుట్ట కు వచ్చినా ఇక్కడి పేద ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన అన్నారు.
No comments:
Post a Comment