హైద్రాబాద్, జనవరి 20, (way2newstv.in)
హైదరాబాద్ లో కాలుష్య తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. మాస్కులు లేనిదే బయటికి రాలేని పరిస్థితి రాబోతుంది. కొన్ని ఏరియాల్లో ఎయిర్ పొల్యూషన్ లెవల్ తీవ్ర స్థాయికి చేరుతోంది. జాగ్రత్తలు పాటించకపోతే మనం బతికేందుకు పీల్చేగాలే …మనకు హాని చేస్తోందంటున్నారు డాక్టర్లు.ఇండియన్ ఇస్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజా అధ్యయనం చేసింది. నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, పంజాగుట్ట ఫ్యారడైజ్ , చార్మినార్ లాంటి ప్రాంతాల్లో ధూళి కాలుష్యం విపరీతంగా పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజా లెక్కల్లో తేలింది. ఈ లెక్కల ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళి కణాలు 2.5 పీఎం మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు.
గ్రేటర్ పరిధిలో 55 లక్షల వాహనాలు
కానీ అంతకు రెట్టింపే పలు ప్రాంతాల్లో నమోదవుతున్నట్లు పీసీబీ లెక్కలు చెబుతున్నాయికొన్ని జంక్షన్లలో వాయుకాలుష్యం బాగా పెరిగింది. గ్రేటర్ పరిధిలో 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు.. పొగ, దుమ్ము కాలుష్యానికి కారణమవుతున్నాయి. అంతేకాదు బహిరంగ ప్రదేశాలలో చెత్తను తగలబెడ్డటంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు.. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాలు.. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. సూక్ష్మ ధూళి కణాల మోతాదు పెరగటం వల్ల.. ఊపిరితిత్తులు, గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లుపురుషుల కంటే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు ఈమధ్య కాలంలో బాగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. మగవారి కంటే ఆడవారికి తట్టుకునే స్వభావం తక్కువగా ఉండటమే కారణమంటున్నారు. ధూళి కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను దెబ్బతీస్తాయని.. కాలుష్యం బారిన పడకుండా మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు.చాలా ప్రాంతాల్లో మోతాదుకు మించే ఎయిర్ పొల్యూషన్ నమోదవుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కలు చెప్తున్నాయి. గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకి రావటం వల్ల కూడా పొల్యూషన్ మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. వాహన కాలుష్యాన్ని అరికట్టాలని, కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియత్రించాలని అభిప్రాయ పడుతున్నారు. పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
No comments:
Post a Comment