Breaking News

12/12/2019

బాబు బాటలోనే జగన్

విజయవాడ, డిసెంబర్ 12 (way2newstv.in)
ఒకరు తక్కువ కాదు, మరొకరు ఎక్కువ లేదు, కొన్ని విషయాల్లో జగన్, చంద్రబాబు ఒక్కటే. వారి రాజకీయ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అంటున్నారు. ఏపీ అసెంబ్లీ సీన్ చూస్తే పాత సీన్లు మళ్ళీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సీట్లు అటూ ఇటూ మరాయి కానీ అవే మాటలు, అవే సవాళ్ళు, అవే గోడు, అవే గోడవలు. చూస్తున్న జనాలకు మాత్రం తేడా ఏమీ కనిపించడంలేదని అంటున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు టీవీ లైవ్ టెలికాస్ట్ లో ఆయన బొమ్మ అసలు కనిపించేది కాదు, ఇక సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేచి జగన్ ని టార్గెట్ చేసేవారు, ఇపుడు జగన్ వంతు వచ్చింది. ఆయన చేతిలో అసెంబ్లీ ఉంది. దాన్ని చూసి ఇది వైసీపీ ఆఫీస్ అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్ళు, అప్పట్లో ఇదే మాట వైసీపీ నోట కూడా వచ్చింది, అసెంబ్లీని టీడీపీ ఆఫీస్ గా మార్చేశారని అప్పట్లో వీరూ అన్నారు.
బాబు బాటలోనే జగన్

జగన్ పార్టీ నుంచి నాడు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి మరీ చంద్రబాబు రాజకీయ రుబాబు చేశారు. అందులో నలుగురిని మంత్రులుగా చేసి జగన్ ని ఏమీ కాదు పొమ్మన్నారు. పైగా జగన్ టికెట్ ఇస్తే గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారు బాబు గూటిలో చేరి అదే జగన్ ని నానా మాటలు అన్నారు. నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు తిట్టినా సహిస్తారు కానీ నిన్నటి వరకూ తనతో ఉన్న వారు వెన్నుపోటు పొడిచి అవతల వైపు నుంచి బాణాలు విసురుతూంటే తట్టుకోవడం బహు కష్టం. మరి నాడు జగన్ ని ఇదే రకమైన రాక్షస క్రీడతో హింసించిన చంద్రబాబుకు ఇపుడు ఇదే అసెంబ్లీలో ఇంతకు ఇంతా అవుతోంది. తాను టికెట్ ఇచ్చి గెలిపించిన వల్లభనేని వంశీ ఇపుడు తన కళ్ల ముందే జగన్ ని పొగుడుతున్నారు. తనని దారుణంగా విమర్శిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా తనపైన హాట్ కామెంట్స చేస్తూంటే భరించడం బాబు గారి వల్లకావడంలేదు మరి.ఉమ్మడి ఏపీలో ఎలా జరిగినా విభజన తరువాత 13 జిల్లాల ఏపీకి చంద్రబాబుకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. మరి బాబు కంటే సీనియర్ పొలిటీషియన్ ఏపీ రాజకీయల్లో ఎవరూ లేరు కూడా. నాడు ఆయనే సమున్నత విలువలు నెలకొలిపి ఉంటే ఇపుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని అంతా అంటున్నారు. బాబుతో పోలిస్తే జగన్ రాజకీయ జీవితం చాలా చిన్నది. చంద్రబాబు లాంటి వారు మార్గదర్శులుగా ఉండాలి. కానీ దురదృష్టమేమిటంటే బాబు హయాంలో రాజకీయం మొత్తం తన చుట్టూ తిప్పుకున్నారు. స్పీకర్ తాను చెప్పినట్లే వినాలని, అసెంబ్లీ తాను అనుకున్నట్లే జరగాలని బాబు ఆశించారు, ఓ విధంగా శాసించారు. దాని ఫలితమే నేటి శాసనసభ. దాని కొనసాగింపే బాబుకు ఎదురవుతున్న అవమానాలు, శాపనార్ధాలు. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత అనాల్సివస్తుందేమో. మరి ఇకనైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకుంటే జగన్ లాంటి వారు కూడా మారే అవకాశం ఉంటుంది. అటువంటి రాజకీయాలని చూడాలని ప్రజలకు కూడా ఆశ ఎక్కడో ఉంది. కానీ అది సాధ్యమేనా?

No comments:

Post a Comment