హైద్రాబాద్, డిసెంబర్ 16 (way2newstv.in):
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారన్న సస్పెన్స్ తెరదించుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ చెప్పారు బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు. తేజూ, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ప్రతిరోజు పండగే డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన దిల్ రాజు పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీపై క్లారిటీ ఇస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు.
పింక్ లో పవన్ నటిస్తారు : దిల్ రాజు
ఆయన మాట్లాడుతుండగా.. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలు వేస్తూ రచ్చ చేయడంతో ‘పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడమ్మా వెయిట్ చేయండి.. ఆ రోజు దగ్గరల్లోనే ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ‘పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని నా 20 ఏళ్ల డ్రీమ్.. తొందర్లోనే ఫుల్ ఫిల్ అయిపోద్దేమో’ అంటూ త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉండబోతుందని ప్రతిరోజు పండగే ప్రీ రిలీజ్ వేడుక వేదికగా అధికారిక ప్రకటన చేశారు దిల్ రాజు.బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ లీడ్ రోల్స్‌లో నటించిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు దిల్ రాజు. డిసెంబర్ 12 పింగ్ రీమేక్ మూవీ ఎస్వీసీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. పింక్ రీమేక్‌తో పవన్ కళ్యాణ్ మూవీకి తొలిసారి సంగీతం అందించబోతున్నారు తమన్.
No comments:
Post a Comment