Breaking News

13/12/2019

కొలిక్కి వచ్చిన మహారాష్ట్ర కేబినెట్ కసరత్తు

ముంబై, డిసెంబర్ 13  (way2newstv.in)
మహారాష్ట్రలో సర్కార్ ఏర్పడి దాదాపు పదిరోజులు పదిహేను రోజులు దాటుతున్నా ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ కూర్పుపై మూడు పార్టీలు కలసి కూర్చుని చర్చించింది లేదు. కొన్ని కీలక శాఖలపై ఇంకా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి వర్గ విస్తరణకు నోచుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.మహారాష్ట్రలో జరిగిన ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేశాయి. అధికారానికి కావాల్సిన స్థానాలను సాధించాయి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడానికి సిద్ధమయింది. 
కొలిక్కి వచ్చిన మహారాష్ట్ర కేబినెట్ కసరత్తు

దీతో బీజేపీ ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను దగ్గరకు తీయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తర్వాత రాజీనామా చేయడం వంటివి చకా చకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు.ఉద్ధవ్ థాక్రేతో పాటు మరో ఆరుగురు మంత్రులు అదేరోజు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికీ జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి? ఏ శాఖలను కేటాయించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శరద్ పవార్ పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండటంతో ఆయన సోదరుడు కుమారుడు అజిత్ పవార్ ఉద్ధవ్ థాక్రేతో మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరుపుతున్నారు. ఉద్ధవ్ థాక్రే తో పాటు ప్రమాణస్వీకారం చేసిిన ఆరుగురు మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరగలేదు.అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిప్యూటీ సీఎం పదవిపై పార్టీ నేతలతో చర్చించాల్సి ఉంది. అజిత్ పవార్ కే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని శరద్ పవార్ భావిస్తున్నారు. త్వరలోనే ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశమై దీనిపై శరద్ పవార్ స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. మరోవైపు ఉద్ధవ్ థాక్రే కీలకమైన ఆర్థిక శాఖ, హౌసింగ్ శాఖలను ఎన్సీపీకి అప్పగించేందుకు అంగీకరించారు. శివసేన హోంశాఖను తనవద్దనే ఉంచుకోనుంది. కాంగ్రెస్ కు రెవెన్యూ శాఖ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై స్పష్టత ఈరోజే వచ్చింది.. మొత్తం మీద మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడినా శాఖల కేటాయంపు మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై బీజేపీ సెటైర్లు వేయడం ప్రారంభించింది.

No comments:

Post a Comment