విజయవాడ, డిసెంబర్ 10 (way2newstv.in)
రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఉండేవే. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. రాజకీయాల్లో రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కామేనే అయినా.. సీనియర్లు.. చాలా మంది ఉన్నప్పటికీ.. వైసీపీ నుంచి జూనియర్లు రంగంలోకి దిగుతున్నారు. పట్టుమని పదేళ్ల రాజకీయ అనుభవం కూడా లేని చాలా మంది నాయకులు, నాయకురాళ్లు వైసీపీ తరఫున గళం వినిపిస్తూ.. చంద్రబాబును మాటల తాటాలతో గాయపరుస్తున్నారనే చెప్పాలి.నిజానికి రాజకీయాల్లో అయినా ఎక్కడైనా.. కూడా స్థాయిని బట్టి విమర్శలు ఉంటాయనేది వాస్తవమే. అయితే, ఇప్పుడు మారిన రాజకీయాల్లో ఎవరు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే.. ప్రత్యర్థి అయితే చాలు.. విమర్శించడమే. ఇప్పుడు ఇదే ఫార్ములాను వైసీపీ అనుసరిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
బాబును ఆటాడేసుకుంటున్నారు...
వైసీపీలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. చంద్రబాబుకు సమకాలికులు అతి తక్కువ మంది ఉన్నప్పటికీ.. కనీసం 15 నుంచి 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు వైసీపీలో ఉన్నారు. అయితే, వీరిని పక్కన పెట్టి.. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను జగన్.. చంద్రబాబుపై మాటల యుద్ధానికి పంపుతున్నారు.వైసీపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. వీరిలో నిన్నటి ఎన్నికల్లో కొత్తగా విజయం సాధించిన విడదల రజనీ, ఉండవల్లి శ్రీదేవి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు ఇక, తన పార్టీలోనే రాజకీయంగా పురుడు పొసుకున్న కొడాలి నాని వరకు చాలా మంది జూనియర్లు చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడేసు కుంటున్నారు. గతంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో వాడిన బ్రీఫ్‌డ్ మి డైలాగు సహా అలా ముందుకెళ్తాం.. అనే డైలాగు వరకు కూడా తిరిగి ఆయనపైనే ప్రయోగిస్తున్నారు.అదే సమయంలో కాల్ మనీ ఉదంతాన్ని కూడా తెరమీదికి తెచ్చి.. మహిళల భద్రతకు చంద్రబాబుకు పట్టదనే విదంగా రజనీ, శ్రీదేవిలు ఓ రేంజ్‌లో అసెంబ్లీలోనే ఆడేసుకుంటున్న పరిస్థితి చంద్రబాబుకు ఓ రకంగా ఇబ్బందిగానే పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఏదేమైనా.. జగన్ సీనియర్లను కాదని జూనియర్లను రంగంలోకి దించడం వారు రెచ్చిపోవడం చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. వారిచేతిలో మాటలు పడేకంటే చంద్రబాబు అసెంబ్లీ సమావేేశాలకు వెళ్లకపోవడమే మంచిదని టీడీపీ నేతలు అభిప్రాయపడతున్నారు.
No comments:
Post a Comment