Breaking News

19/12/2019

కరీంనగర్ కలెక్టర్ బదిలీపై రాజకీయ రచ్చ

కరీంనగర్, డిసెంబర్ 19(way2newstv.in
రీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ ఇప్పుడు ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అనేక అంశాల్లో వార్తల్లోకి ఎక్కిన సర్ఫరాజ్ అహ్మద్, ఇప్పుడు సడెన్‌గా ట్రాన్స్‌ఫర్‌ కావడంపై అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. సర్ఫరాజ్‌ బదిలీ సాధారణమా లేదంటే రాజకీయ రగడలూ కారణమా? కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ బదిలీ, జిల్లాలో హాట్‌ టాపికయ్యింది. కొంతకాలంగా కలెక్టర్ బదిలీ అవుతారనే ఊహగానాలు వినిపిస్తున్నా ఎట్టకేలకు ప్రభుత్వం బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌ఫరైన సర్పరాజ్ అహ్మద్ స్థానంలో గద్వాల కలెక్టర్ శశాంక బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా మూడేళ్లు పని చేసిన సర్ఫరాజ్ అహ్మద్‌పై బదిలి వేటు పడడానికి చాలా కారణాలున్నయంటు అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 
కరీంనగర్  కలెక్టర్ బదిలీపై రాజకీయ రచ్చ

జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కలెక్టర్ సఖ్యత లేకపోవడం, మంత్రి గంగుల కమలాకర్‌తో ఉన్న విభేదాలే అసలు కారణాలుగా మాట్లాడుకుంటున్నారు. 2016 అక్టోబర్‌లో జిల్లా కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మొదటి నుంచీ మంత్రి గంగుల కమలాకర్‌కు, పెద్దగా సత్పంబంధాల్లేవు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జిల్లా కలెక్టర్ తీరు పట్ల నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు కమలాకర్. ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా అవమానించరంటూ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌లు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగిన కలెక్టర్, వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  కరీంనగర్ ఎంపీ సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంబాషణ లీకై వైరల్ గా మారింది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్‌కి సహకారం అందిస్తున్నారని అధికార పార్టి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల కమలాకర్ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, బిజెపి తరపున పోటి చేసిన సంజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో కలెక్టర్, సంజయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇటివలే బయటకు వచ్చింది. ఆ ఫోన్ సంభాషణలపై కలెక్టర్ ఉన్నాతాధికారులకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కలెక్టర్‌ తనపై కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగ వాఖ్యలు చేయడం మొదలుపెట్టారు మంత్రి గంగుల కమలాకర్. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ వెనక చాలా కారణాలే వినిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. గంగుల కమలాకర్‌తో గొడవతో పాటు గతంలో రసమయి బాలకిషన్‌తో ప్రోటోకాల్ రగడ కూడా జరిగింది. అయితే, కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతుండటంతో, సాధారణ బదిలీ చేసి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి సర్ఫరాజ్‌ అహ్మద్‌ బదిలీ, అధికార యంత్రాంగంలోనే కాదు, రాజకీయవర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశమైంది. బదిలీకి కారణాలంటూ, ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుకుంటున్నారు.

No comments:

Post a Comment