Breaking News

19/12/2019

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: సీపీఐ నేత రామకృష్ణ

అమరావతి డిసెంబర్ 18 (way2newstv.in)
 ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కమిటీ రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుండేదని సీపీఐ నేత రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: సీపీఐ నేత రామకృష్ణ

రాజధాని అంశంపై మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. మంత్రుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. రాజధానిని ఒక మంత్రి శ్మశానం అని మాట్లాడారంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌ను తప్పుపట్టారు. రాజకీయాలు చేస్తున్నారే తప్ప.. అధికారంలోకి ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని రామకృష్ణ విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతే కొనసాగాలని ఆకాంక్షించారు. రాయలసీమలో ఎవరూ ప్రత్యేక రాష్ట్రం అడగడం లేదన్నారు.

No comments:

Post a Comment