శ్రీకాకుళం, డిసెంబర్ 2 (way2newstv.in)
సిక్కోలు జిల్లాలో ధర్మాన కుటుంబం అంటే జనాలకు గురి. ఆ కుటుంబం రాజకీయంగా నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయింది. డక్కామెక్కీలు తిని కూడా పడిలేచిన కెరటంలా మళ్ళీ సత్తా చాటుకుంటూనే ఉంది. ఇదిలా ఉండగా వైసీపీ జిల్లాలో బలపడడానికి ధర్మాన కుటుంబం పాత్ర కీలకంగా ఉందని అంతా అంటారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పదికి ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇచ్చి భారీ విజయాన్ని జనం కట్టబెట్టారు. కేవలం రెండు సీట్లు గెలుచుకున్న టీడీపీ నిజానికి చతికిలపడాలి. కానీ ఇక్కడ నుంచే జగన్ కి సవాల్ చేస్తున్న నాయకులు ఉన్నారు. జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్న నేతాశ్రీలు ఉన్నారు. జగన్ కి చికాకు పెడుతున్న కింజరపు అచ్చెన్నాయుడుది ఒక తీరు అయితే, ప్రతీ సారీ లేఖకు రాస్తూ, ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ని కార్నర్ చేస్తున్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుది మరొక తీరు.
ధర్మానకు పదవీ యోగం
ఇక మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ రెబెల్ రాజకీయం ఇంకో తీరు. వీరే కాకుండా లోకల్ గా ఉన్న టీడీపీ నేతలు ఎక్కడైకక్కడ బలమైన వాణిని వినిపిస్తూ వైసీపీని చెడుగుడు ఆడేస్తున్నారు.ఇక సిక్కోలు జిల్లా అన్ని విధాలుగా వెనకబడిఉందని గ్రహించిన జగన్ నోరున్న మంత్రి కొడాలి నానిని ఇంచార్జి మంత్రిగా కోరి మరి ఎంపిక చేశారు. కొడాలి నాని జిల్లాకు వస్తూనే చేసిన తొలి పని సీనియర్ నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇంటికి వెళ్ళడం. ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్న ప్రసాదరావుతో ముచ్చట్లు పెట్టిన కొడాలి నాని యాక్టివ్ కావాలని ఆయన్ని గట్టిగానే కోరారు. అదే సమయంతో తన వెంట ఉన్న మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని మరీ అంత మెతగ్గా ఉంటే ఎలా అంటూ సోదరుడి ముందే అడిగేశారని టాక్. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి టీడీపీపై ఒంటరి పోరాటం చేస్తున్న తమ్మినేని సీతారాం పాటి మంత్రి హోదాలో ఉండి చేయలేరా అంటూ దాసన్నకు క్లాస్ తీసుకున్నట్లుగా కూడా టాక్. ఈ పరిణామాలతోనే దాసన్న రెచ్చిపోయి మరీ సభల్లో నోరు జారేస్తున్నారని అంటున్నారు.శ్రీకాకుళం లాంటి జిల్లా నిజానికి శ్రీకాకుళానికి పెట్టని కోట. కాంగ్రెస్ హయాంలో, అదీ వైఎస్సార్ జమానాలో కూడా యాభై శాతం సీట్లు మాత్రమే హస్తం పార్టీకి దక్కాయి. తప్ప ఇలా 80 శాతం పైగా గెలవలేదు. అంటే అంతగా జనాలు జగన్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నా టీడీపీ రఫ్ఫాడించేస్తూంటే అన్ని విధాలుగా అధికారం ఉండి వైసీపీ సైలెంట్ గా ఉండడం పట్ల కొడాలి నాని అసంత్రుప్తి గా ఉన్నారని అంటున్నారు. దాసన్న నోరు ఎంత పెంచినా ఆయనకు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పెద్దగా తెలియవని అంటున్నారు. దాంతో జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని ఓటు మాత్రం ధర్మాన ప్రసాదరావుకే అంటున్నారు. మరి జగన్ లోకల్ బాడీ ఎన్నికల తరువాత సత్తా చూపని మంత్రులను ఇంటికి పంపిస్తానని చెబుతున్నారు. అటువంటి మార్పు చేర్పులు ఉంటే సీనియర్ ధర్మాన ప్రసాదరావు మంత్రి అయినా ఆశ్చర్యపోనవరం లేదని ఆయన వర్గం అపుడే సంబరపడుతోంది. చూడాలి మరి.
No comments:
Post a Comment