Breaking News

16/12/2019

శిల్పారామం లో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళ ప్రారంభం

హైదరాబాద్ డిసెంబర్ 16  (way2newstv.in)
శిల్పారామం  లో ఇరవై అయిదవ   ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డంకా మోగించి ప్రారంభించారు.  ఈ కార్యక్రమ లో శిల్పారామం ప్రత్యేక  అధికారి  కిషన్ రావు పాల్గొన్నారు .  క్రాఫ్ట్స్ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 400 చేనేత హస్తకళా స్టాల్ల్స్ ని కలియతిరిగి చూసి వారితో ముచ్చటించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల్ నుంచి వచ్చిన రగ్గులు, నారాయణపేట చీరలు , బంజారా వర్క్ బ్లౌసులు, రాజస్థాన్ కోటా చీరలు, లక్నో చికెన్ కారి చీరలు, డ్రెస్సులు, పోచంపల్లి చీరలు మరియు దుప్పట్లు, గద్వాల్ చీరలు, బనారస్ చీరలు, 
శిల్పారామం  లో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళ ప్రారంభం

జబల్పూర్ చీరలు, కుప్పడం, వర్లీ పెయింటింగ్స్, పాతచిత్ర పెయింటింగ్, రాజస్థానీ పెయింటింగ్ , అనంతపూర్ తోలు బొమ్మలు, లేఅథెర్ లాంప్స్,  బాందిని చీరలు, ఎన్నో రకాల మట్టి బొమ్మలు, మట్టి పాత్రలు, బ్లూ పాటరా, ఢిల్లీ చద్దర్లు , వుడ్ కార్వింగ్, బాంబు బుట్టలు కుర్చీలు, చండేరీ చీరలు  మొదలైనవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ వారు  స్పాన్సర్ కళా రూపాలు, తెలంగాణ రాజన్న డోలు, లంబాడి, ఛత్తీస్గఢ్ కక్సారి నృయం, మద్యప్రదేశ్ కోకు నృత్య, కర్ణాటక గౌరవర కుణిత నృత్యాలు , శ్రీ సరసవాని నాట్య కళా మందిర్ వారి భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.ప్రతి జిల్లా కేంద్రాలలో శిల్పారామాలుచేసేవిదంగా ప్రణాళికలు తయారుచేస్తున్నాము.  అందులో భాగంగా మహబూబ్ నగర్, సిద్ధిపేట , వరంగల్  జిల్లా లలో మినీ శిల్పారామాలు త్వరలో ప్రారంభిస్తాము అని చెప్పారు.

No comments:

Post a Comment