Breaking News

23/12/2019

గ్రీవెన్ సెల్ ఆకస్మిక తనిఖీ చెసిన కలెక్టర్ హోళికేర్

బెల్లంపల్లి   డిసెంబర్ 23 (way2newstv.in):
 బెల్లంపల్లి పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు సోమవారం గ్రీవెన్ సెల్ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఫిర్యాదు దారుల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పిర్యాదు దారుల  సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు  బెల్లంపల్లి పట్టణంలోని . 
గ్రీవెన్ సెల్ ఆకస్మిక తనిఖీ చెసిన కలెక్టర్ హోళికేర్

సింగరేణి క్వార్టర్ ల విషయంలో ప్రభుత్వానిదె చివరి నిర్ణయం అని, 2014 ఉత్తర్వుల ప్రకారం దీర్ఘకాలికంగా ఉన్న వారికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఇళ్ళ పట్టాలు అందజేస్తుందని అన్నారు  మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారినికై కార్యాలయానికి వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా పలకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రెవిన్యూ  సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment