Breaking News

14/12/2019

సిరిసిల్ల చేనేతలకు ఉపాధి దిశగా అడుగులు

కరీంనగర్, డిసెంబర్ 14, (way2newstv.in)
సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడానికి సర్కారుచర్యలు తీసుకుంటోంది. ఉపాధి అవకాశాల కోసం నిరంతరాయంగా ఆర్డర్లు సమకూరుస్తోంది. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల జిల్లాలో నేతన్నలకు రూ.300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్తో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పించింది. ప్రస్తుతం క్రిస్మస్, రాజీవ్విద్యామిషన్(ఆర్వీఎం) ఆర్డర్లు కూడా ఇస్తూ వారికి చేతినిండా పని కల్పిస్తోంది. బతుకమ్మ చీరలు సెప్టెంబర్మాసంతో పూర్తవుతాయి. ఆ తర్వాత నేతన్నలు ఖాళీగా ఉండకుండా క్రిస్మస్కానుకలు ఇవ్వడం కోసం సర్కారు రూ.15 కోట్ల ఆర్డర్ఇచ్చింది. దీనికి తోడు రాజీవ్విద్యామిషన్(ఆర్వీఎం)కు సంబంధించి 1.3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేయడానికి రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేనేత జౌళిశాఖ అధికారులు ఇప్పటికే సిరిసిల్ల ఎస్ఎస్ఐ సంఘాలతో వస్త్రం తయారు చేయిస్తున్నారు. 
సిరిసిల్ల చేనేతలకు ఉపాధి దిశగా అడుగులు

దీంతో సిరిసిల్లలో15 వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ పని ముగియగానే రంజాన్కు 6 లక్షల మీటర్ల వస్త్రాన్ని తయారు చేయించనున్నారు. రంజాన్ కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించనుంది.బతుకమ్మ చీరల తయారీలో ప్రతిసారి ఏదో ఒక అవాంతరం ఏర్పడి ఉత్పత్తి ఆలస్యం కావడం, సమయానికి చీరల పంపిణీ పూర్తి కాకపోవడం నాలుగేళ్లుగా జరుగుతోంది. దీంతో ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. చేనేత జౌళిశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. వచ్చే బతుకమ్మకు  చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్అంచనా ఇవ్వడంతోపాటు జనవరి నుంచే చీరలు తయారు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చేనేత జౌళిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2020 సంవత్సరం బతుకమ్మకుగాను కోటి చీరలకు సంబంధించి 7 కోట్ల మీటర్లకు ఆర్డర్లు జనవరిలోనే సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వనున్నారు. ఈ చీరల తయారీ వచ్చే ఏడాది వినాయక చవితి నాటికి పూర్తిచేసి.. ఆయా జిల్లాలకు పంపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. బతుకమ్మ చీరల తయారీకి సమయం ఎక్కువ ఉంటే డిజైన్లు కూడా ఎక్కువ ఇవ్వొచ్చని, ఏయే డిజైన్లు ఇవ్వాలనే దానిపై చేనేత జౌళిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.సిరిసిల్ల నేతన్నలు తయారు చేసే చీరలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్పెరుగుతోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పంపిణీ చేసే కానుకల కోసం సిరిసిల్ల నేతన్నలకు చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలవారు కూడా సిరిసిల్ల చీరలు కావాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, ఆర్వీఎంతో పాటు ఇతర ఆర్డర్లతో నేతన్నలు బీజీగా ఉండడంతో ఇతర రాష్ట్రాల ఆర్డర్లుతిరస్కరిస్తున్నారు.ప్రభుత్వం క్రిస్మస్ కానుకలతోపాటు ఆర్వీఎం ఆర్డర్లు రూ.75 కోట్లు సిరిసిల్లకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పని కూడా మొదలైంది. ఈసారి జనవరిలోనే బతుకమ్మ చీరల తయారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.

No comments:

Post a Comment