నిజామాబాద్, డిసెంబర్ 28, (way2newstv.in)
నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్స్ పవర్ నెగ్గిందా... ఆ రెండు ప్రధాన వర్గాల మధ్య నెలకొన్న రాజకీయ ఎత్తుగడలు నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్ రావు బదిలీకి కారణమేనా. ముక్కుసూటితనం, నిక్కచ్చిగా వ్యవహరించడం ఆయన బదిలీకి కారణమయ్యాయా.. జిల్లాలో ఉభయ ప్రత్యర్ధుల మధ్య నెలకొన్న రాజకీయ వ్యవహారాల కారణంగా రామ్మోహన్ రావు బదిలీ అయ్యారా.. కలెక్టర్ ఆకస్మిక బదిలీ కి కారణాలేంటి...నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు స్వీకరించిన రామ్మోహన్‌రావు అనతికాలంలోనే జిల్లాలో తనదైన మార్క్ చూపించాడు. 2018 జనవరి6న జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ఆయన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు.
పాలిట్రిక్స్ లో కలెక్టర్లు
పార్లమెంట్ ఎన్నికల్లో 185 మంది పోటీచేసినా ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయకుండా సజావుగా నిర్వహించి తన సత్తా చాటారు కలెక్టర్ రామ్మోహన్ రావు.ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టారు కలెక్టర్. నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో తెరవెనుక రాజకీయాలు మొదలైయ్యాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వార్ మొదలైంది. ప్రభుత్వకార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం నడిపిస్తున్న కలెక్టర్‌పై ఒత్తిల్లు మొలైయ్యాయి. ఎంతకీ రాజీపడకపోవడంతో రామ్మోహన్‌రావును బదిలీ చేశారు. కలెక్టర్ రామ్మోహన్ రావు.. మొన్నటివరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇటీవలే బదిలీ అయ్యారు..ముక్కుసూటితనం, నిక్కచ్చిగా వ్యవహరించడం, ప్రోటోకాల్ పాటించడం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గని వైనం ఆయన సొంతం..ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కలెక్టర్ ఆకస్మిక బదిలీ పలువురిని చర్చించుకునేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో పవర్ పాలిటిక్సే కలెక్టర్ బదిలీకి కారణమని చర్చ జోరుగా జరుగుతోంది. రెండు ప్రధాన వర్గాల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్లనే కలెక్టర్ బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రొటోకాల్, రూల్స్కు అనుగుణంగా నిర్వహించడం వల్లనే కలెక్టర్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. కలెక్టర్ రామ్మోహన్ రావు బదిలీకి రెండు బలమైన ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న రాజకీయ వ్యవహారాల్లో భాగంగానే జరిగినట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. అయితే బదిలీ అయిన కలెక్టర్ జనవరి 6, 2018లో వచ్చారు. వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తూ వెనువెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. రూల్స్ ప్రకారం వెళ్లారు. అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వరుసగా నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 185 మంది పోటీచేసినా కూడా వాయిదా వేయకుండా శ్రమించి ఎన్నికలను సజావుగా నిర్వహించి తన సత్తా చాటారు కలెక్టర్ రామ్మోహన్ రావు .అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారి ఎం-3 ఈవీఎంలను వినియోగించారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచినప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది. అధికారులపై ఒత్తిడి పెరిగింది. నిబంధనల మేరకు ఎంపీ కూడా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులతో సమీక్షిస్తుoడడంతో అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల మధ్య దూరం పెరిగింది. ఆ ప్రభావం అధికారులపైన పడింది. రూల్స్ ప్రకారం ఎంపీకి కూడా తగిన సమాచారాన్ని అందించడంతో జిల్లాలో కొన్ని కీలకమైన శాఖల అధికారులు బదిలీ అయ్యారు. అదే రీతిలో ప్రస్తుతం కలెక్టర్ను కూడా బదిలీ చేసినట్లు సమాచారం. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ సమీకరణల్లో భాగంగానే ఈ బదిలీ లు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించినంత కాలం రాజకీయాలకతీతంగా పనిచేసి పలువురి మన్ననలు పొందిన కలెక్టర్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగలేదు..ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే అధికారులనే నియమించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చేవి మున్సిపల్ ఎన్నికలు కావడంతో తమది పైచేయిగా ఉండేందుకు ఆకస్మికంగా కలెక్టర్ను బదిలీ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతొంది. ఇదే రీతిలో పోతే భవిష్యత్తులో మరికొంత మంది అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి కూడా నిక్కచ్ఛితంగా వ్యవహరించే వ్యక్తే. తొలిసారిగా ములుగు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయన పాలనలో తనదైన శైలిని అవలంభించారు. ములుగు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మిక బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని తెలుస్తోంది. మేడారం జాతర పనుల విషయంలో రాజీ పడకపోవడం, పనుల అప్పగింత విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే కలెక్టర్ ను రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యహారంలో రాష్ట్ర మంత్రి ఒకరు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ములుగు జిల్లాకు చెందిన నేతలు కొందరు మంత్రిని కలిసి వచ్చిన వెంటనే ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు రావడం ఇందుకు ఊతమిస్తోంది. సరిగ్గా రెండేళ్ల కిందట మేడారం జాతరకు ముందే అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళిని ట్రాన్ ఫర్ చేయగా, ప్రస్తుతం నారాయణరెడ్డి బదిలీ కావడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. జాతర ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లను విడుదల చేసింది. గతంలో మేడారం జాతర పనులను నామినేషన్ వర్క్లుగా విభజించి తూతూ మంత్రంగా చేపట్టి, నిధులు కాజేయడం అన్నట్లుగా ఉండేది. మహా జాతర జరుగుతున్న సమయంలోనూ ఓ వైపు భక్తులు ఉంటే.. మరోవైపు పనులు చేస్తూ ఉండేవారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ పార్టీకి చెందిన నేతలే పనులు చేయడం అక్కడ ఆనవాయితీ. కానీ ఈసారి కలెక్టర్ నారాయణరెడ్డి రాజకీయ నేతల ఆగడాలకు చెక్ పెట్టారు. పనులను నామినేషన్ వర్క్లుగా విభజించడానికి అంగీకరించలేదు. సంక్రాంతి లోపే పనులు పూర్తిచేయాలని కండీషన్ పెట్టారు. 47 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చి టెండర్లు పిలిపించారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల నాణ్యత పరిశీలించడానికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇవేవీ అధికారపార్టీ నేతలకు రుచించలేదు. ప్రధానంగా ములుగు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కలెక్టర్ చర్యలను జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలంతా నాలుగైదు రోజుల క్రితం వరంగల్ వెళ్లారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి నివాసంలో పంచాయితీ పెట్టారని సమాచారం.ఇక జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆదివారం రాత్రి కలెక్టర్ నారాయణరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 2018లో కూడా ఇలాగే అప్పటి జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళిని కూడా ప్రభుత్వం మహా జాతరకు ముందే బదిలీ చేసింది. నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే అప్పట్లో ఆయన ట్రాన్స్ఫర్ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్అయ్యింది. మేడారం జాతర పనులకు సంబంధించి తమ మాట వినకుంటే కలెక్టర్స్థాయి వ్యక్తులను కూడా ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి అక్కడి పొలిటికల్ శక్తులు ఎదిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. అధికారులు, ఉద్యోగులలో జవాబుదారీ తనాన్ని పెంచేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఆ యాప్ ద్వారా ఉద్యోగుల హాజరు నమోదు చేశారు. ఉద్యోగి ఎక్కడ ఉన్నా యాప్లో ఫొటోతీసి పెట్టేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఆ యాప్ను ఎస్టీవోకు అనుసంధానం చేసి సాలరీ ఇచ్చే విధంగా ఏర్పాట్లను చేశారు. ప్లాస్టిక్ నిషేధంపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ములుగు-వెలుగు పేరు మీద కార్యక్రమాన్ని ప్రకటించి కార్యక్రమాలను చేపట్టారు. ఏ సమస్య ఉన్నా వెలుగు కార్యక్రమం ద్వారా పరిష్కరిం చారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజావాణి ని ఏర్పాటు చేశారు.గ్రామాల్లో ప్రజావాణి నిర్వహిస్తూ భూసమస్యలను పరిష్కరించారు.మారైతే మారాజు పేరున ప్రత్యేక యాప్ రూపొందించి రైతు సమస్యలను పరిష్కరించారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను చేయడంతో పాటు పనుల్లో కాంట్రాక్టర్లు పారదర్శకంగా పనులు చేసే విధంగా చూశారు. ములుగు జిల్లా పరిధి లో గోదావరిలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశార కలెక్టర్ నారాయణ రెడ్డి.. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలను నిరోధించారు. అనుమతులను సక్రమంగా ఉండే విధంగా చూశారు. అక్కడ ఇసుక మాఫియాపై ఉక్కుపాదాన్ని మోపారు. పాలనలో విభిన్న రీతిలో ప్రజల వద్దకు చేరువైన కలెక్టర్లు రామ్మోహన్ రావు, నారాయణ రెడ్డి లు ఇద్దరి వైఖరి దాదాపు ఒకేలా ఉంటాయి..కలెక్టర్ రామ్మోహన్ రావు తీరుతెన్నులను జీర్ణించుకోలేని నిజామాబాద్ పొలిటికల్ క్యాడర్... నిజామాబాద్ నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి పనితీరు తో ఎలా కలిసి నడుస్తారో చూడాల్సిందే. రాజీ పడని వ్యక్తిత్వం గల కలెక్టర్ నారాయణ రెడ్డి మన నిజామాబాద్ జిల్లాలో కూడా అదే రీతిలో వ్యవహరించే అవకాశం ఉందా. నిత్యం ఆకస్మిక తనిఖీలు,పారదర్శకత, జవాబుదారీ తనంతో పనిచేసే ఆయన నిజామాబాద్ జిల్లాలో ఎలా వ్యవహరిస్తారో మున్ముందు చూడాలి..
No comments:
Post a Comment