అమరావతి డిసెంబర్ 13 (way2newstv.in)
‘దిశ’ ఘటన తర్వాత మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో స్త్రీల రక్షణ నిమిత్తం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. బిల్లు ప్రవేశపెట్టడంలో చూపిన ఉత్సాహం చట్టం అమలులో కూడా చూపాలని వ్యాఖ్యానించారు.
దిశ’ బిల్లుకు పూర్తి మద్దతు: చంద్రబాబు
‘దిశ’ బిల్లు రూపకల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొన్ని చట్టాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆయన తెలిపారు. ‘దిశ’ బిల్లులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అత్యాచార ఘటనల విషయంలో సమాజంలో మార్పులు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.
No comments:
Post a Comment