న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (way2newstv.in)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారా? మరోసారి అవకాశమొస్తే ప్రధాని పదవి చేపట్టాలన్న ఆశ ఆయనలో ఇంకా ఉందా? అంటే అవుననే అంటున్నారు. 1984లో లో జరిగిన సంఘటనకు మన్మోహన్ మరో కలర్ ఇచ్చి కామెంట్స్ చేయడం వివాదంగా మారింది. మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై దేశమొత్తం మీద నెగిటివ్ కామెంట్స్ విన్పిస్తున్నాయి. తన గురువు లాంటి పీవీ నరసింహారావుపైనే నిందను మోపడం తగదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.మన్మోహన్ సింగ్ మౌనమునిగా పేరుగాంచారు. ఆయన దశాబ్దకాలం ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు నోరు జారలేదు. రిమోట్ కంట్రోల్ పీఎంగా ప్రత్యర్థులు విమర్శలు చేసినా ఆయన చలించలేదు.
వీరవిధేయుడు యూ టర్న్ వెనుక...
అయితే తాజాగా మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన గౌరవానికి భంగం కల్గించేవే అంటున్నారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత జరిగింది.అప్పట్లో పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉండేవారు. అప్పుడు హోంమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ మాటలను విని ఉంటే సిక్కుల ఊచకోత జరిగిేది కాదని మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సైన్యాన్ని వెంటనే రప్పించాలని ఐకే గుజ్రాల్ చేసిన సూచనను పీవీ నరసింహారావు పట్టించుకోలేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.నిజానికి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజకీయ గురువు అనే చెప్పాలి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ను పీవీ నరసింహారావు ఏరికోరి ఆర్థికమంత్రిగా తెచ్చుకున్నారు. పీవీ నరసింహారావును గాంధీ కుటుంబం దూరం పెట్టింది. ఆ సంగతి మన్మోహన్ కు తెలియంది కాదు. గాంధీ కుటుంబం మెప్పు పొందడానికే మన్మోహన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మొత్తం మీద మౌనమునిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ పీవీ నరసింహారావుపై సంచలన వ్యాఖ్యలు చేసి తన గౌరవాన్ని తగ్గించుకున్నట్లయింది
No comments:
Post a Comment