Breaking News

30/12/2019

అచ్చంపేటలో ఉపాధి లేక వలసలు

మహబూబ్ నగర్, డిసెంబర్ 30, (way2newstv.in)
అచ్చంపేట నియోజకవర్గ ప్రజల పరిస్థితి నెలకొని ఉంది చుట్టూ బిరబిరా పారుతున్న కృష్ణానది ఉన్నా త్రాగడానికి, సాగుకు నీరు గతి లేక  రైతన్నలు, ప్రజలు ప్రభుత్వాల వైపు ఎదురు చూస్తున్నారు.దానికి తోడు పకృతి అందాల నడుమ నిరంతరం వివిధ రాష్ట్రాల నుండి రోజుకు వేల సంఖ్యలో శ్రీశైలం, మద్దిమడుగు, ఉమామహేశ్వరం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులతో, ప్రకృతి ఆరాద్యులతో, పర్యాటకులతో కిలకిలలాడుతూ నల్లమల ప్రాంతం గొప్ప వ్యాపార ప్రాంతంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉన్నప్పటికిని ప్రభుత్వాలు పట్టించు కోకపోవడంతో ఇక్కడి ప్రజలు ఉపాది లేక వలసలు పోతున్నారు.  
అచ్చంపేటలో ఉపాధి లేక వలసలు

మద్దిమడుగు, మాచర్ల మద్య ఉన్న కృష్ణా నదిపై దాదాపు 1.5 కి.మీ. మేర వంతెన నిర్మిస్తే అచ్చంపేట ప్రాంతం వ్యాపార పరంగానూ, విద్య పరంగానూ మరింత అభివృద్ది చెందడమే కాక ఆంద్ర ప్రాంతానికి ఇటు శ్రీశైలం, బెంగుళూరు దూరాలను దాదాపు 150 కి.మీ మేర తగ్గే అవకాశం ఉన్నప్పటికి ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించక నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి బెంగుళూరు వెళ్ళేందుకై మల్లేపల్లి, జడ్చెర్ల, అనంతపురం మీదుగా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే శ్రీశైలం, మద్దిమడుగు పుణ్యక్షేత్రాలకు ఆ ప్రాంతం నుండి వేల సంఖ్యలో భక్తులు రావాలన్నా దూరం కారణంగా ఎన్నో అవస్థలకు గురైనా వస్తున్నారు.ఇక్కడ వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతాల నుండి దూరం సులువు కావడమే కాకుండా పదర, అమ్రాబాద్, అచ్చంపేట మండలాలు పర్యాటకంగా అభివృద్ది  చెంది ఇక్కడి ప్రజలకు ఉపాది కూడా పెరిగే అవకాశాలు అనేకం ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు శాసన సభల్లో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అభివృద్ది శూన్యంగానే ఉంది.ఎన్నికల సమయంలో హామీలకు పరిమితమౌతూ గెలిచాక మరిచిపోవడం ఇక్కడి పాలకుల వంతైంది. మంత్రి హరీష్‌రావు సైతం ఈ వంతెన నిర్మాణం గురించి ప్రస్తావించినప్పటికీ దానిని కార్యరూపం దాల్చేదెప్పుడో అని నియోజకవర్గ ప్రజలు, నిరుద్యోగులు ఎదురుచూస్తూ నిట్టూరుస్తున్నారు. ఆంద్ర, తెలంగాణ పాలకులు ఇప్పటికైనా స్పందించి తెలుగు రాష్ట్రాలను కలిపే ఈ వంతెనకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment