Breaking News

16/12/2019

రామప్ప టెంపుల్ పనులను పర్యవేక్షించిన పార్థసారథి

వరంగల్ డిసెంబర్ 16 (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  వ్యవసాయ శాఖ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ ల ముఖ్య కార్యదర్శి పార్థసారథి తన రెండు రోజుల  వరంగల్ పర్యటనలో భాగంగా రామప్ప టెంపుల్ ను సందర్శించారు . టూరిజం గైడ్ లు రామప్ప దేవాలయ చరిత్ర ను విశదీకరించారు అనంతరం  యునెస్కో సంబంధించిన విషయాల మీద ఆరా తీశారు. దీనిలో భాగంగా రామప్ప దేవాలయంలోని జరుగుతున్న పనులను పర్యవేక్షించారు . తరువాత ప్రఖ్యాతమైన రామప్ప సరస్సు లోని ఐలాండ్ ను పరీశీలించారు. 
రామప్ప టెంపుల్ పనులను పర్యవేక్షించిన పార్థసారథి

ఐలాండ్ ను పర్యాటకంగా  అభివృద్ధి చేయడానికి వీలు ఉందని అన్నారు. అలాగే రామప్ప చెరువు గట్టు పైన మరిన్ని కాటేజీలు నిర్మించే అవకాశం ఉన్నదని కూడా టూరిజం అధికారులతో చర్చించారు  . రామప్ప ఒక మంచి పర్యాటక కేంద్రంగా పర్యాటకులకు పర్యాటక అభివృద్ధి సంస్థ అందిస్తున్న కాటేజీలను నిర్వహణ , రెస్టారెంట్ నిర్వహణ ఈ సరస్సులో బోట్ల పనితీరు ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  డిస్ట్రిక్ట్ టూరిజమ్ ఆఫీసర్ శివాజీ, పర్యాటక అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏకాంబరం , అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్య కిరణ్ మరియు పాలంపేట సర్పంచ్  దొలి రజిత శ్రీనివాస్, వెంకటాపూర్ మండల తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment