Breaking News

09/12/2019

కేబినెట్ ఆమోదం కోసం కాళేశ్వరం ఎక్స్ టెన్షన్ పనులు

అంచనాలు సిద్ధం చేసిన ఇరిగేషన్ శాఖ
కరీంనగర్, డిసెంబర్ 8, (way2newstv.in)
కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ పనులకు రూ.34 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని సర్కారు లెక్కగట్టింది. ఇందులో రూ.29,593 కోట్ల పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఇరిగేషన్‌‌‌‌  అధికారులు సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాల మేరకు ఇంజనీర్లు దీనిపై కసరత్తు మొదలుపెట్టారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి మూడో టీఎంసీ తరలింపు పనులను ప్రస్తుత ఏజెన్సీలతోనే చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. లింక్‌‌‌‌–1లోని హైడ్రో మెకానికల్‌‌‌‌, ఎలక్ట్రో మెకానికల్‌‌‌‌, సివిల్‌‌‌‌, కాంక్రీట్‌‌‌‌ పనులకు రూ.4,657.95 కోట్లతో ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ శాంక్షన్‌‌‌‌ ఇచ్చారు. ఇప్పటికే సివిల్‌‌‌‌ పనులు పూర్తవగా.. మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. 
కేబినెట్ ఆమోదం  కోసం కాళేశ్వరం ఎక్స్ టెన్షన్ పనులు

రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌ ఇప్పటికే అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది.మిడ్‌‌‌‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌‌‌ వరకు రెండో టీఎంసీ తరలింపు పనుల కోసం రూ.14,093.43 కోట్ల అప్పును రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి తీసుకునేందుకు అగ్రిమెంట్‌‌‌‌ కూడా పూర్తయింది. ఇంజనీర్లు ఇప్పటికే రెండో టీఎంసీ తరలింపు పనులపై ఓ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేసినట్టు తెలిసింది. మిడ్‌‌‌‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌‌‌ వరకు 45 కిలోమీటర్ల దూరం నీటిని తరలించేందుకు పైప్‌‌‌‌లైన్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ చానల్‌‌‌‌, మూడు పంపుహౌస్‌‌‌‌లను ప్రతిపాదించారు. ఇందులో 30 కిలోమీటర్లకుపైగా పైప్లైన్‌‌‌‌ ఉంటుందని అధికారులు వెల్లడించారు. రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి తీసుకున్న అప్పుతో ఈ పనులు పూర్తవుతాయని ఇంజనీర్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని, సర్కారు అనుమతి తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ నెల 11న నిర్వహించే కేబినెట్‌‌‌‌ సమావేశంలో ఈ పనులకు అనుమతి వచ్చే అవకాశముందనిపేర్కొన్నారు.ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌‌‌ మానేరుకు నీటిని తరలించేందుకు రూ.11,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. టన్నెల్‌‌‌‌ ద్వారా తరలించాలని మొదట నిర్ణయించినా.. సీఎం ఆదేశాలతో పైపులైన్‌‌‌‌కు మార్చినట్టు తెలిసింది. దీంతో రూ.1,500 కోట్లు ఖర్చు పెరిగింది. ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌‌‌‌ మానేరుకు నీళ్లు తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉంది. దానికి సమాంతరంగా 32 కిలోమీటర్ల పైపులైన్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ చానల్‌‌‌‌, ఒకట్రెండు పంపుహౌస్‌‌‌‌లు అవసరమని అంచనా వేశారు. మరోసారి సర్వేచేసి అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేయనున్నారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి నెలాఖర్లో టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. లింక్‌‌‌‌–1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అయ్యే  రూ.4,657 కోట్లను కలిపితే.. అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం రూ.34 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు.

No comments:

Post a Comment