హైదరాబాద్ డిసెంబర్ 18, (way2newstv.in)
సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని పండుగలను ప్రభుత్వం తరుపున నిర్వహిస్తున్నారని, అన్ని పండుగలను ప్రభుత్వ నిర్వహించే చరిత్ర దేశంలో ఎక్కడ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్ పేట్ మల్టీపర్పస్ పంక్షన్ హాల్ లో క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం తరుపున క్రిస్మస్ గిప్ట్ ప్యాకెట్లను అందజేశారు.
క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేసిన మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కేసిఆర్ క్రిస్మస్ సంబరాలను దృష్టిలో ఉంచుకోని ప్రతి సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడా గిప్ట్ ప్యాకెట్లను అందజేసి విందును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాలలో ఆదర్శంగా నిలుస్తుందని, సనత్ నగర్ నియోజకవర్గంలో 5 వేల మంది గిప్ట్ ప్యాకెట్లను అందజేయనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment