Breaking News

31/12/2019

పార్టీ సాంగ్ `డాంగ్ డాంగ్`తో ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోన్నసూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.  ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా చిత్రం నుండి డాంగ్ డాంగ్  ఫుల్ లిరిక‌ల్‌ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.ఆజ్ రాత్ మేరే గ‌ర్ మే పార్టీ హై తు ఆజానా... అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ మహేశ్‌, త‌మ‌న్నాల‌పై అమేజింగ్ స్టెప్స్‌తో అభిమానులు, ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో అదిరిపోయే స్టెప్పులేశారు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. 
పార్టీ సాంగ్ `డాంగ్ డాంగ్`తో  ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోన్నసూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`

ఈ న్యూ ఇయ‌ర్‌కి ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి వారిలో జోష్ నింపాడు దేవి శ్రీ. ఈ సాంగ్ రేపు థియేటర్ లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులను కంపోజ్ చేశారు. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా న‌కాష్ అజిజ్‌, ల‌వితా లోబో ఆల‌పించారు.జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో  మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

No comments:

Post a Comment