జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిరిసిల్ల, డిసెంబర్ 2 (way2newstv.in)
ప్రజావాణికి వచ్చి ప్రజలు పెట్టుకునే ఆర్జీలను, విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని జనహిత హాల్ లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణభాస్కర్ సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎన్ ఖీమ్యా నాయక్ ల తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న విజ్ఞప్తుల పై సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు..కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 158 ఫిర్యాదులు అందాయి. అందులో డబుల్ బెడ్ రూమ్ ల సమస్యలు 34, రెవెన్యూ సంబంధిత సమస్యలు- 63, పెన్షన్ మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ 61 అందాయి. డయల్ యువర్ కలెక్టర్ కు 2 ఫిర్యాదులు అందాయి.
No comments:
Post a Comment