Breaking News

14/12/2019

క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలన మీదటే మున్సిపల్ వార్డు హద్దులు నిర్ణయించాలి

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి డిసెంబర్ 14(way2newstv.in)  
క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించిన మీదటే మున్సిపాలిటీలో వార్డుల హద్దులను నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మున్సిపల్ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని మున్సిపాలిటీ లలో వార్డుల విభజనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆయామున్సిపాలిటీల వారీగా కలెక్టర్ వార్డుల హద్దుల నిర్ణయంపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఇతర సంస్థల ద్వారా వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు.
క్షేత్రస్థాయి ప్రత్యక్ష పరిశీలన మీదటే మున్సిపల్ వార్డు హద్దులు నిర్ణయించాలి

 అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పాత మున్సిపాలిటీలలో ఉన్న వార్డులు, జనాభా, ఓటర్ల సంఖ్య, కొత్తగా వార్డు హద్దులు కోసమై వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలు తదితర వాటిపై క్షుణ్నంగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యటించాలని ప్రస్తుతం ఉన్న హద్దులు, కొత్తగా ఏర్పాటు చేసే వార్డుల హద్దులకు ఆధారాలను, అలాగే ఓటర్ల సంఖ్య, ఓటర్ జాబితా అన్నిటి ఆధారంగా వార్డుల హద్దులను నిర్ణయించాలని తెలిపారు.కాగా వార్డుల విభజన పై పెబ్బేర్ మున్సిపాలిటీలో రెండు అభ్యంతరాలు, కొత్తకోట లో 4, వనపర్తి మున్సిపాలిటీ లో 19 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా స్పెషల్ ఆఫీసర్ సంతోష్, వనపర్తి మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, కొత్తకోట మున్సిపల్ ప్రత్యేకాధికారి యుగంధర్ రెడ్డి, కమిషనర్, తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

No comments:

Post a Comment